Begin typing your search above and press return to search.

ఈ ఐడియా బాగుంది ..ఓ లుక్కేయండి అధ్యక్షా !

By:  Tupaki Desk   |   12 Jun 2020 6:00 AM IST
ఈ ఐడియా బాగుంది ..ఓ లుక్కేయండి అధ్యక్షా !
X
ఓ కంటికి కనిపించని వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాల రూపురేఖల్ని పూర్తిగా మార్చేసింది. ఈ వైరస్ విజృంభణ మొదలైన తర్వాత చాలా దేశాల్లో రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మొఖానికి మాస్క్ పెట్టుకోవడం , భౌతికదురం పాటించడం మన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. మాస్క్ లేకుండా బయటకి వస్తే పోలీసులు భారీగా ఫైన్స్ వేస్తున్నారు. ఈ వైరస్ దెబ్బకి ఆ దేశం ..ఈ దేశం అన్న తేడాలేకుండా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. దీనితో అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఒకవైపు ప్రజాపాలన చేస్తూనే ..మరో వైపు ఆర్థిక పరిస్థితి చక్కబెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ వైరస్ రోజుకొక విధముగా రూపాంతరం చెందుతూ ..మరింతగా విజృంభిస్తుండటంతో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది.

ఇకపోతే , ఈ వైరస్ ను అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ నుండి కేంద్రం ఇప్పటికే భారీగా సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని కార్యకలాపాలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో త్వరలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉండటంతో , ఈ క్లిష్ట సమయంలో పార్లమెంటు సమావేశాలు ఎలా నిర్వహించాలని మన దేశంలో తర్జనభర్జనలు పడుతున్నారు. ఆన్ ‌లైన్‌ లో వర్చువల్‌గా నిర్వహించాలా ఎలా చేయాలి అన్నదానిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి.

అయితే , ఇప్పుడు ఆ సమస్య కి ఓ చక్కటి పరిష్కారం దొరికింది. ఓసారి పై ఫోటోని చుడండి. అసలు ఆ ఫోటోకి మనదేశంలో పార్లమెంట్ సమావేశాలకు ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా ? అక్కడ జరుగుతోంది కూడా పార్లమెంటు సమావేశాలే, జర్మనీలోని హాంబర్గ్‌లో ఆ రాష్ట్ర పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఈ వైరస్ వ్యాపిస్తున్న‌ నేపథ్యంలో ప్రతి సభ్యుడు వేర్వేరుగా కూర్చునేందుకు వీలుగా ఇలా వారి మధ్య దళసరి గ్లాస్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు ముందు వెనకున్న సీట్ల మధ్య దూరాన్ని కూడా పెంచారు. ఏదేదో బాగుంది కదా ..మనదేశంలో కూడా ఈ విధంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే ..ఏ సభ్యుడు కూడా వైరస్ భారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అసెంబ్లీ లో దీనికి అనుగుణంగా మార్పులు చేసి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించుకోవచ్చు ...