Begin typing your search above and press return to search.

గేల్ చితక్కొట్టిన సిక్స్ వెనకాల అంతుందా!

By:  Tupaki Desk   |   19 Oct 2020 12:50 PM GMT
గేల్ చితక్కొట్టిన సిక్స్ వెనకాల అంతుందా!
X
ఐపీఎల్లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టై అవగా సూపర్ ఓవర్ ఆడిస్తే సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో సంచలనంగా మారింది. మొత్తానికి క్రికెట్ అభిమానులకు అంతులేని ఆనందాన్ని మిగిల్చింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో క్వింటన్ డికాక్ (53) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేక పోవడంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులే చేసింది. సాధ్యమైన లక్ష్యంతోనే బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ (77) మెరుపులు మెరిపించడంతో మ్యాచు సులువుగానే గెలుస్తుందని అనుకున్నారు. కానీ చివర్లో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో చివరికి మ్యాచ్ టై అయ్యింది. ఇరు జట్ల మధ్య సూపర్ నిర్వహించగా మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసింది. ఛేదనలో ముంబై కూడా 5 పరుగులే చేయడంతో మళ్లీ మ్యాచ్ టై అయ్యి రెండో సూపర్ ఓవర్ ఆడించారు.

రెండో సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 11 పరుగులు చేసింది. ఆ తర్వాత పంజాబ్ తరపున ఛేదనకు మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్ వచ్చారు. మ్యాచ్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చే ముందు మైదానంలో గేల్ కోపం గా కనిపించాడు. ఆడిన తొలి బంతిని సిక్సర్ గా మలిచాడు. రెండో బంతికి సింగిల్ తీసి స్ట్రైకింగ్ మయాంక్ కు ఇచ్చాడు. అతడు వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో పంజాబ్ సునాయాసంగా విజయం సాధించింది.

మ్యాచ్ ముగిసాక గేల్ మాట్లాడుతూ రెండో సూపర్ ముందు నాకు ఎటువంటి ఒత్తిడి లేదు. కానీ ఈ విపరీతమైన కోపం వచ్చింది. అందుకు కారణం ముందే సులువుగా గెలవాల్సిన మ్యాచ్ ని సూపర్ ఓవర్ దాక తెచ్చుకుని జట్టును ఆ పరిస్థితుల్లో చూడటమే కారణమని చెప్పాడు. మొదటి సూపర్ ఓవర్లో ఐదు పరుగులను కూడా కాపాడిన షమీని గేల్ ప్రశంసించాడు.