Begin typing your search above and press return to search.

ధోనీని ఆడుకున్న గౌతమ్ గంభీర్

By:  Tupaki Desk   |   23 Sept 2020 4:00 PM IST
ధోనీని ఆడుకున్న గౌతమ్ గంభీర్
X
అవకాశం వస్తే ధోనీని తీవ్ర స్థాయి లో విమర్శించడం గౌతమ్​ గంభీర్​ కు అలవాటు. ధోనీ తీసుకొనే ప్రతి నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా అతడి పై చెలరేగి పోతుంటాడీ మాజీ క్రికెటర్​. అయితే తాజాగా మరోసారి మహీని ఓ రేంజ్​లో తగులుకున్నాడు గంభీర్​. కాగా ధోనీ కెప్టెన్సీ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతుంటాయి. అతడు తీసుకొనే నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయని.. ప్రత్యర్థులను తికమకపెడతాయని.. అందుకే ధోని సారథ్యంలోని జట్టు, ఐపీఎల్​లో ఉన్నా లీగ్​ లో ఉన్నా ప్రత్యర్థులకు చుక్కలు కనబడతాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ప్రశంసిస్తుంటారు. అయితే ప్రస్తుతం ధోనీని గౌతమ్​ గంభీర్​ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. నిన్నటి మ్యాచ్​ లో చెన్నై సూపర్​ కింగ్స్​ ఓడిపోవడం తో గంభీర్​ విమర్శలకు పదునుపెట్టాడు.

‘రాజస్థాన్​ రాయల్స్​ చెన్నైకి 217 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టైం లో ధోని నంబర్​ 4లోనో 5 వస్థానంలో బ్యాటింగ్ కు రావాలి. తెలివైన కెప్టెన్​ ఎవరైనా ఆ పనే చేస్తాడు. కానీ ధోనీ మాత్రం ఏడోస్థానంలో వచ్చాడు. ఇదో తెలివితక్కువ పని. మురళీ విజయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శామ్‌ కరన్‌లు ధోని కంటే ముందు క్రీజులోకి వచ్చారు. ఇది చాలా ఆశ్చర్యకరం. వీళ్లంతా ఏమన్నా ధోనికంటే తోపు బ్యాట్స్​మెన్​ లా ఎవరి చెవిలో పూలు పెడతారు? జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్​ ఇలా చెతులెత్తేస్తా ఎలా. 217 ప్లస్‌ పరుగుల ఛేదనలో ఉన్నప్పుడు తన కంటే తక్కువ స్థాయి బ్యాట్స్​మన్లను ముందు పంపించి ధోని టైం వేస్ట్​ చేశాడు. ఇది నిజంగా మతిలేని చర్య.. ఆఖర్లో దిగిన ధోని వరుసగా మూడు సిక్సులు కొట్టాడు. మ్యాచ్ కు​ ఇదేమన్నా ఉపయోగపడిందా.. ధోనికి వ్యక్తిగత స్కోర్​ పెరిగింది. ధోని కాకుండా మరే కెప్టెన్​ అయినా ఇలా మతిమాలిన నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తేవి. కానీ అక్కడ ఉన్నది ధోనీ కాబట్టి విమర్శలు చేసేందుకు అందరూ భయ పడుతున్నారు’ అంటూ గంభీర్​ ట్విట్టర్​ లో చాలా ఘాటుగా వ్యాఖ్యానించాడు.

అయితే ధోని ఓడి పోయిన ప్రతి సందర్భం లోనూ గంభీర్​ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కామనే.. దీంతో అభిమానులు కూడా లైట్​ తీసుకొనేవారు. కానీ ఇప్పుడు మాత్రం అభిమాను లు గంభీర్​ చెప్పింది కరెక్టే అంటున్నారు. ధోని కొంచెం ముందుగా బ్యాటింగ్​కు వచ్చినా.. కొంచెం దూకుడుగా ఆడినా ఈజీగా జట్టు గెలిచేదని కామెంట్లు పెడుతున్నారు. నిన్నటి ఐపీఎల్​లో ముందుగా బ్యాటింగ్​ చేసిన రాజస్థాన్​ రాయల్స్​ 217 పరుగుల లక్ష్యాన్ని చెన్నైకి ఇచ్చింది. ఈ మ్యాచ్​ లో 14 వ ఓవర్​లో బ్యాటింగ్​ కు వచ్చిన ధోని.. డుప్లెసిస్‌ కు ఏమాత్రం సహకరించలేదన్న విమర్శలు వచ్చాయి. ఆఖర్లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో ధోని చెలరేగాడు. అప్పటికే మ్యాచ్​ చేయిదాటిపోయింది. చెన్నై స్కోరును 200 మార్క్‌కు మాత్రం చేరుకున్నది.. డుప్లెసిస్‌ తోడుగా ధోని ముందే బ్యాట్‌ కు పని చెప్పి ఉంటే షార్జా పోరు లో ఫలితం భిన్నంగా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ స్కోర్ల మ్యాచ్‌ లో రాజస్థాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.