Begin typing your search above and press return to search.
సన్నిహితుడిపై వేటు వేసిన కేసీఆర్.. కారణాలు ఇవేనా?
By: Tupaki Desk | 4 March 2021 9:41 AM ISTఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుంటున్నారా? మీ అంచనా నిజమే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ సమావేశం నిర్వహించినా.. ఆయన వెన్నంటి ఉండే వ్యక్తిగా.. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సరిగ్గా కేసీఆర్ వెనుక కనిపించే ఈ వ్యక్తి పేరు గటిక విజయకుమార్. ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ గా..ముఖ్యమంత్రి పౌర సంబంధాల అధికారిగా ఆయన్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ మాటకు వస్తే.. ఆ రెండు ఉద్యోగాలకు తానే రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.
అయితే.. అసలు కారణం వేరేనని చెబుతున్నారు. సీఎం పీఆర్వో హోదాను అడ్డుపెట్టుకొని అవినీతి.. అక్రమాలకు పాల్పడిన విషయాన్ని గుర్తించి..ఆయనపై వేటు వేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణల్ని విజయ్ కుమార్ ఖండించారు. ఇంతకీ.. ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీడియా వర్గాల్లో పెను సంచలనంగా మారిన ఈ వైనంలోకి వెళితే..
విజయ్ కుమార్ తీరుపై మొదట్నించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ మీడియా వ్యవహారాలు చూడటానికి సీపీఆర్వోతో సహా ముగ్గురు పీఆర్వోలు ఉన్నప్పటికి.. విజయకుమార్ అన్నీ తానై అన్నట్లుగా నడుచుకునేవారు. సొంత ఇమేజ్ కోసం పాకులాడినట్లుగా ఆయన మీద ఆరోపణలున్నాయి. నిత్యం.. సీఎం ఉండటం.. ఆయనతో పాటు జిల్లాల పర్యటనలకు వెళ్లటం.. మీడియా సమావేశాల్లో సీఎం వెనుకాలే కూర్చోవటంతో ఆయన కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడన్న పేరు వచ్చింది.
ఇదే సమయంలో తన కోసం ట్రాన్స్ కోలో జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టును క్రియేట్ చేసేలా చేశారన్న విమర్శ ఉంది. ఈ శాఖలో ఏఈగా సంస్థలో చేరిన ఉద్యోగి 36 ఏళ్ల సర్వీసు పూర్తి చేసినా ఎస్ఈ కావటం కష్టం. అలాంటిది ఎస్ఈ స్థాయి పోస్టును క్రియేట్ చేసి.. విజయకుమార్ కు ఉన్న అర్హతులతో నియామక నోటిఫికేషన్ ఇవ్వటం అప్పట్లో సంచలనంగా మారింది.
అర్హులు ఎంతోమంది ఆ పోస్టు కోసం ప్రయత్నం చేసినా.. విజయ్ కుమార్ కు మాత్రమే దక్కింది. సీఎం పీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నందున ఆయనకు అడిషినల్ డ్యూటీ అలవెన్స్ కింద నెలకు రూ.1.2లక్షలు చెల్లించేందుకు ట్రాన్స్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు సీఎం పీఆర్వోగా.. మరోవైపు ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ గా వ్యవహరిస్తున్న విజయ్ ను ఆ రెండు పదవుల నుంచి ఒకేసారి తొలగించటం సంచలనంగా మారింది.
ప్రగతిభవన్ కు పక్కనే ఉన్న హోటలోని గదిలోకూర్చొని సెటిల్ మెంట్లు చేస్తున్నారని.. మాదాపూర్ లోని ఒక రియల్ ఎస్టేట్ వెంచ్ లో తన సామాజిక వర్గానికి చెందిన 18 మందికి ప్లాట్లు ఇప్పించటం.. కావూరి హిల్స్ లోని ఒక గెస్టు హౌస్ వేదికగా తీసుకొని.. సెటిల్ మెంట్లు చేయటం సీఎం వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇలా ఆయనపై తరచూ వస్తున్న ఆరోపణలపై సీరియస్ గా ఎంక్వయిరీ చేయించిన సీఎం కేసీఆర్.. తాజాగా వేటు వేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఆరోపణల్ని విజయ్ కుమార్ ఖండిస్తున్నారు.