Begin typing your search above and press return to search.

గంటా ఆ పార్టీలోకేనా...పక్కా ప్లాన్ తోనే... ?

By:  Tupaki Desk   |   21 Feb 2022 1:30 AM GMT
గంటా ఆ పార్టీలోకేనా...పక్కా ప్లాన్ తోనే... ?
X
విశాఖ జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో వర్గ పోరు ఎపుడూ కొనసాగుతూనే ఉంది. అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కూడా గ్రూపుల గోల అలాగే సాగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే గంటా వల్ల పార్టీకి ఉపయోగం లేదని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఆయన వ్యతిరేక వర్గం టీడీపీ మీద వత్తిడి తీసుకువచ్చిందని కూడా ప్రచారం సాగుతోంది. దాంతోనే గంటా డుమ్మా కొట్టారు అని టాక్.

ఇక గంటా తన ఇపుడు వేరే ఆప్షన్లలో ఉన్నారని అంటున్నారు. ఆయన జనసేనలో చేరాలని చూస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. అదే విధంగా జనసేన టీడీపీ పొత్తులు కనుక ఉంటే ఆ కోటాలో సీటు సంపాదించి రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారు అని అంటున్నారు.

తొందరలోనే గంటా మెగా స్టార్ చిరంజీవిని కలసి తన రాజకీయ భవిష్యత్తు మీద చర్చిస్తారు అని అంటున్నారు. మొత్తానికి గంటాకు పొగ పెడుతోంది సొంత పార్టీ వారేనని, వారి విషయంలో హై కమాండ్ పట్టించుకోకపోవడం వల్లనే తమ నేత అలా ఉండాల్సి వస్తోందని అనుచరులు చెబుతున్నారు.

నిజానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అధినాయకత్వానికి మధ్య గ్యాప్ మరింత పెరగడానికి యాంటీ గంటా బ్యాచ్ కూడా కారణం అంటున్నారు. ఇక గంటా చంద్రబాబు నిర్వహించిన మీటింగునకు డుమ్మా కొట్టడం వెనక ఆయన వ్యతిరేక వర్గం చర్యలు కూడా ఉన్నాయని అంటున్నారు.

గంటా మీద లేనిపోనివి ఆయన వ్యతిరేక వర్గం గా ఉన్న నేతలు పార్టీ అధినాయకత్వానికి పదే పదే ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఇక గంటాకు విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుతో పడదు అన్నది ప్రచారంలో ఉంది.

బయటకు ఇద్దరు నేతలు మాకేంటి మేము ఒక్కటే అని చెప్పుకున్నా కూడా ఇద్దరి మధ్య విభేధాలు అలాగే ఉన్నాయి, కొనసాగుతున్నాయి. నిజానికి 2008లో గంటా ప్రజారాజ్యంలో చేరిపోవడానికి కూడా పార్టీలో వ్యతిరేకుల పోరు పడలేకే అని అనుచరులు అంటారు.

ఇక 2014లో గంటా టీడీపీలో చేరడం కూడా అయ్యన్నపాత్రుడుకి ఇష్టం లేదనే చెప్పాలి. విశాఖలో చంద్రబాబు సమక్షంలో నాడు గంటా చేరికను ఆయన బాహాటంగానే వ్యతిరేకించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గంటా మంత్రి అయ్యారు.

అయితే ఈ ఇద్దరు మంత్రుల మధ్య పోరు అలాగే సాగిందని చెబుతారు. 2019 ఎన్నికల్లో గంటా భీమిలీ సీటు మీదకు లోకేష్ బాబుని తెప్పించి మరీ ఆయనకు దాన్ని కాకుండా చేయాలని ఆయన వ్యతిరేకులు ప్రయత్నం చేశారు అని అంటారు.

ఇక గంటాకు ఎంపీ టికెట్ ఇవ్వమని హై కమాండ్ కి చెప్పడం ద్వారా ఆయన్ని రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయాలని చూశారని అంటారు.

ఇక టీడీపీ ఓడిపోయాక గంటా సైలెంట్ కావడం వెనక ఇలాంటి రీజన్స్ ఉన్నాయని అంటారు. లేటెస్ట్ గా ఆయన టీడీపీ మీటింగునకు వెళ్లకపోవడంలోనూ ఇలాంటి విషయాలే ఉన్నాయట. ఈ పరిస్థితులలో తనదైన శైలిలో రాజకీయాన్ని చేసే గంటా ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.