Begin typing your search above and press return to search.

ఆ మాజీ మంత్రి మీద నమ్మకం లేదా...ఆయన రెడీనా..?

By:  Tupaki Desk   |   1 Feb 2022 2:30 AM GMT
ఆ మాజీ మంత్రి మీద నమ్మకం లేదా...ఆయన రెడీనా..?
X
టీడీపీలో ఇపుడు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో టీడీపీ ఆలోచనలకు ఈ రోజు జరుగుతున్న పరిణామాలకు చాలా తేడా ఉందని అంటున్నారు. ఇక అధినేత చంద్రబాబులో కూడా భారీ మార్పు వచ్చింది అని చెబుతున్నారు. ఆయన ఈసారి కచ్చితంగా నమ్మేది విధేయులనే అని అంటున్నారు. గతంలోలా ఎవరడిగినా కరిగిపోయి అన్నీ మరచిపోయి టికెట్లు అంత ఈజీగా ఇచ్చే సీన్ అయితే లేదు అనే అంటున్నారు.

ఇదిలా ఉండగా ఈసారి ఎంత పెద్ద వారు అయినా కూడా బాబు మార్క్ టెస్టుల్లో విజేతలు కాకపోతే మాత్రం టికెట్ దక్కడం కష్టమే అంటున్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే ఉత్తరం నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేస్తారా లేదా అన్న దాని మీద క్లారిటీ అయితే లేదు అని చెబుతున్నారు.

మరో వైపు అక్కడ టీడీపీ పోటీకి వేరే వారిని చూస్తోందని టాక్ అయితే ఉంది. ఆ వేరే వారు ఎవరో కాదు, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుట. ఆయన ఈ మధ్యనే తాను బీజేపీలోనే ఉంటాను అని గట్టిగా చెప్పారు కానీ దాన్ని ఎవరూ అంతగా నమ్మడంలేదు. రాజకీయాలో ఇవన్నీ మామూలే అని కూడా అంటున్నారు.

ఇక విష్ణు కుమార్ రాజు విషయానికి వస్తే గత ఎన్నికల్లోనే ఆయన టీడీపీ నుంచి ఉత్తరం నుంచి పోటీ చేయడానికి ట్రై చేశారని చెబుతారు. చివరి నిముషంలో మార్పుల వల్ల అక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేశారు. దాంతో రాజు గారు బీజేపీ నుంచి పోటీకి దిగి ఓడిపోయారు. ఈసారి ఆయన కచ్చితంగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టలనుకుంటున్నారు.

దాంతో ఆయన టీడీపీలో చేరి టికెట్ సంపాదిస్తారు అని అంటున్నారు. ఆయనకు ఉత్తరాన బాగానే పట్టు ఉంది. కానీ సరైన పార్టీ అండ లేకపోతే గెలవలేరు, అలాగే టీడీపీకి మంచి క్యాడర్ అయితే ఉంది, కానీ లీడర్లు గట్టి వారు లేరు. దాంతో రాజు గారికి కండువా కప్పేసి టీడీపీ తరఫున నిలబెడతారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. ఇక గంటా వేరే సీటు నుంచి పోటీ చేయాల్సిందే అంటున్నారు.

ఇపుడు గంటా టీడీపీలో మళ్లీ యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే అధినాయకత్వం మాత్రం ఇంకా ఆయన వైఖరి మీద పూర్తి నమ్మకం వ్యక్తం చేయడంలేదు అంటున్నారు. గంటా టీడీపీలోనే చివరి వరకూ కొనసాగితే అపుడు పరిస్థితులను బట్టి ఆయనకు ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా టికెట్ ఇచ్చే విషయం పరిశీలిస్తారు అంటున్నారు. మొత్తానికి గంటా వంటి సీనియర్ సిట్టింగ్ గా ఉండగానే పక్క పార్టీ వైపు టీడీపీ చూస్తోంది అంటే మాజీ మంత్రి మీద నమ్మకం లేదా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోందిట. చూడాలి మరి ఉత్తరం ఎవరి చేతిలో టికెట్ దక్షిణం పెడుతుందో.