Begin typing your search above and press return to search.
జగన్ పై వాళ్లిద్దరూ స్పందించారు
By: Tupaki Desk | 26 Dec 2016 9:51 PM ISTపులివెందుల సమస్యలపై నిరసనకు దిగిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. జిల్లా ఇంచార్జీ మంత్రి గంటా శ్రీనివాసరావు - జిల్లాకు చెందిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాయలసీమ నీటి కరువుకి కారణం వైఎస్ కుటుంబ ధనదాహమే కారణమని రాష్ట్ర మానవవనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. పులివెందుల నీటి కష్టాలకు కారణమైన వైఎస్ కుటుంబమని పేర్కొంటూ నేడు దొంగ ధర్నాలతో - కొంగ జపాలతో రైతుల్ని మోసం చేసి - మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో జరిగిన అవినీతి వల్లే నేడు రాష్ట్రానికి దుర్గతి పట్టిందని ఆరోపించారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న పరిస్థితుల్లో కూడా సాగునీటిరంగానికి బడ్జెట్లో పెద్దపీట వేయడం రైతు శ్రేయస్సు పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధికి నిదర్శనమని గంటా పేర్కొన్నారు.
ఎవరికీ పనికిరాదన్న పట్టిసీమను కేవలం 9 నెలల్లో పూర్తి చేసి, రాయలసీమకు నీళ్లు మళ్లించిన సంగతిని ప్రతిపక్ష నేత విస్మరించారా అని గంటా శ్రీనివాస రావు ప్రశ్నించారు. స్వయానా పులివెందుల రైతులే ముఖ్యమంత్రిని కలిసి తమ తోటల్ని కాపాడారని కృతజ్ఞతలు తెలిపిన విషయం మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. రైతుల ఇబ్బందులను గమనించి పులివెందుల కెనాల్ కు నీరందించటమే గాకుండా సరైన యాజమాన్య పద్ధతుల్లో సస్యరక్షణ చర్యలతో తోటలకు సాగునీ అందించి రైతులను ఆదుకున్న విషయం మర్చిపోయి నేడు పరనిందలు, ప్రచార పటాటోపాలకు పాల్పడటం ప్రతిపక్ష నేతకే చెల్లిందని గంటా దుయ్యబట్టారు.
వైసీపీ అధినేత, ప్రతిపక నేత వైఎస్ జగస్ మొద్దు నిద్దుర వదిలి మేల్కొన్నాడని శాసనమండలి డిప్యూటి చైర్మన్ సతీశ్ రెడ్డి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కడప జిల్లాకు ప్రత్యేకించి పులివెందులకు నీరు ఇస్తున్నారన్న భయంతో ధర్నా చేపెట్టారని, మేము ధర్నా చేస్తే పులివెందులకు నీరోచ్చిందని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే చౌకభారు రాజకీయాలు చేస్తున్నారని సతీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వేంపల్లెలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జగస్ వైఖరిపై ఘాటైన విమర్శలు చేశారు. కడప జిల్లా ప్రాజెక్టుల విషయంలో దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెబుతున్నారని.ఆయన హయంలో ఎంత నీరిచ్చారో చెప్పాలి సవాల్ విసిరారు. వైసిపి నేతలకు దమ్మంటే 2011 నుంచి నీటి రికార్డులు చూస్తే నీటి కొసం ఎవరు పోరాడింది తెలుస్తుందని సతీశ్ రెడ్డి అన్నారు. రాయలసీమ నీటికి పట్టిసీమ నీటికి సంబంధం లేదని మాటిమాటికి అంటున్నారని, చదువు రాకుంటే నోర్చుకొవాలి గానీ అవగాహాన రహితంగా మాట్లాడొద్దని సూచించారు. గండికోట పరిహరం ఇస్తామన్నా ముంపువాసులను గ్రామాలను ఖాళీ చేయొ్యుద్దని రెచ్చగొడుతున్నారని, నీటిని అడ్డుకోవాలని చూసే జగస్ ప్రయత్నాలు సాగవని సతీశ్ రెడ్డి హెచ్చరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/