Begin typing your search above and press return to search.

జగన్ మానసిక పరిస్థితి బాగోలేదా?

By:  Tupaki Desk   |   7 Oct 2015 8:45 PM IST
జగన్ మానసిక పరిస్థితి బాగోలేదా?
X
ఏపీ అధికార..విపక్షాల మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు.. ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై విపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపణలు చేయటం తెలిసిందే.

విజయనగరంలో ఏర్పాటు చేయనున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భారీగా భూములు సేకరిస్తున్న ఏపీ సర్కారు.. ఇదంతా కుట్రతోనే చేస్తుందని.. ఏపీ మంత్రి గంటాకు భారీగా భూములు ఉన్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి గంటా స్పందించారు.

భోగాపురంలో తనకు సెంటు స్థలం కూడా లేదని.. తన మీద ఆరోపణలు చేస్తున్న జగన్ వాటిని నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తనకు సెంటు భూమి ఉందని నిరూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. ఒకవేళ తన మీద చేసిన ఆరోపణల్ని నిరూపించే విషయంలో జగన్ కానీ విఫలమైతే.. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.

జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని.. అందుకే అర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ విమర్శించిన గంటా.. వైఎస్ హయాంలో కంపెనీల కోసం వేల ఎకరాల భూమిని దోచుకున్న వ్యక్తి తన గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరి.. గంటా విసిరిన సవాలుకు జగన్ సమాధానం ఇస్తారా?