Begin typing your search above and press return to search.

ఈనెల 16న వైసీపీలో గంటా చేరిక?

By:  Tupaki Desk   |   4 Aug 2020 11:05 PM IST
ఈనెల 16న వైసీపీలో గంటా చేరిక?
X
ఊగిసలాటకు తెరపడింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. గంటా శ్రీనివాస్ రావు వైయస్ఆర్సిపిలో స్వాతంత్ర్య దినోత్సవం మరునాడు చేరబోతున్నట్టు సమాచారం. తేదీ కూడా నిర్ణయించబడిందని ప్రచారం జరుగుతోంది.

ఆగస్టు 15న గంటా వైసీపీలో చేరనున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. తరువాత ఆగస్టు 9వ తేదీ కూడా వినిపించింది. క్విట్ ఇండియా రోజు (8 ఆగస్టు) గంటా టిడిపి నుండి నిష్క్రమించబోతున్నాడని కొందరు చెప్పుకొచ్చారు.

కానీ ఇప్పుడు తుది తేదీని ఆగస్టు 16గా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ చేరిక కార్యక్రమం తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో జరగబోతోందని తెలిసింది. ఆశ్చర్యకరమైన వార్త ఏమిటంటే, అదే రోజు గంటా శ్రీనివాస్ రావుతో పాటు మరికొందరు టిడిపి నాయకులు కూడా వైయస్ఆర్సిపిలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారు ఎవరనేది తెలియాల్సి ఉంది.

అప్పటి వరకు గంటా శ్రీనివాస్ రావు టీడీపీకి పూర్తి దూరంగా.. వైయస్ఆర్సిపి సానుభూతిపరుడిగా కొనసాగుతారు. అతని అనుయాయులు, ఇతర నాయకులు వైయస్ఆర్సిపి యొక్క అనధికారిక పార్టీ సభ్యులుగా వ్యవహరిస్తారని తెలిసింది.