Begin typing your search above and press return to search.

వైసీపీ నేతలతో గంటా భేటీ ...?

By:  Tupaki Desk   |   4 Jan 2020 11:53 AM GMT
వైసీపీ నేతలతో గంటా భేటీ ...?
X
మాజీ మంత్రి - టీడీపీ కీలకనేత - విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు పేరు ఇప్పుడు ఆంధప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. దీనికి ప్రధాన కారణం అయన చెప్పే మాటలకి ..చేసే పనులకి అసలు పొంతన లేకపోవడమే. అయన గత కొన్ని రోజులుగా టీడీపీలో ఉన్నప్పటికీ ..అంతగా యాక్టీవ్ గా అయితే లేరు. గత కొంతకాలంగా గంటా శ్రీనివాస్ రావు పార్టీ మారతారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ - వైసీపీ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే , ఇటీవలే అయన నేను పార్టీ మారడంలేదు అంటూ కొంచెం క్లారిటీ ఇచ్చారు.

అయితే , అయన ఏ పార్టీలో కి వెళ్తారు ..అసలు పార్టీ మారుతారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే .. టీడీపీ కార్యక్రమాలలో పెద్దగా పార్టిసిపేట్ చేయడం లేదు. గత నెలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నది ఒకే ఒక్క రోజు. సమావేశాలు జరిగినన్ని రోజులు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కడే ప్రభుత్వం పై పోరాటం చేసారు. సీనియర్ లీడర్ - మాజీ మంత్రి అయినప్పటికీ కూడా గంటా శ్రీనివాస్ రావు సమావేశాలకు దూరంగా ఉన్నారు. మొత్తం టీడీపీ నుండి 23 మంది గెలిస్తే ..చంద్రబాబుతో పాటు గత అసెంబ్లీ సమావేశాలలో గొంతు కలిపింది కేవలం 4 సభ్యులు మాత్రమే. ఆ నలుగురిలో సైతం మద్దాలి గిరిధర్ రావు ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ ని కలిసి - సభలో టీడీపీ పక్షాన కాకుండా - ప్రత్యేకంగా తనను గుర్తించాలని స్పీకర్ తమ్మినేనిని కోరనున్నట్లు ప్రకటించారు మద్దాలి గిరి.

అయితే , ఇప్పటికే టీడీపీ నుండి ఇద్దరు సర్దేసారు. కానీ , గంటా శ్రీనివాస్ రావు మాత్రం మాటల్లో ఒకటి చెబుతూ.. చేతల్లో మరొకటి చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా గంటా శ్రీనివాస్ రావు వైసీపీ నేతలతో భేటీ అయిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచారం చేస్తోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు - మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ నేత టి.సుబ్బిరామిరెడ్డి ఈ పోటోలో వున్నారు. వీరంతా ఏదో పార్టీలో కలిసి వున్నట్లుగా అర్థమౌతుంది. ఈ ఫోటోలో గంటా శ్రీనివాస్ రావు - రఘురామకృష్ణం రాజు తో ఎదో సీరియస్ డిస్కషన్‌ లో వున్నట్లు తెలుస్తుంది. అయితే.. గంటా వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారా లేక ఈ సమావేశం వెనుక ఇంకేదైనా విషయం దాగి ఉందా అనేది తెలియాలి.