Begin typing your search above and press return to search.
గంటా సౌండ్... అయ్యన్న బ్యాండ్
By: Tupaki Desk | 17 March 2023 9:30 PM ISTపాపం వైసీపీ ఇన్నాళ్ళకు తెలుగుదేశానికి దొరికిపోయింది. నాలుగేళ్లుగా అప్రతిహతంగా విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకెళ్ళిన వైసీపీ ఉత్తరాంధ్రాలో అతి ధీమాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగి టీడీపీ చేతిలో దారుణంగా ఓడిపోయే పరిస్థితిని తెచ్చుకుంది. ఇన్నాళ్ళూ వైసీపీని ఎన్ని రకాలుగా టీడీపీ నేతలు విమర్శిస్తూ వస్తున్నా వారికి ఆ పార్టీ విజయాలు ఒక వైపు మింగుడుపడనీయని పరిస్థితి.
ఇక వైసీపీ నేతలు కూడా టీడీపీ నుంచి వచ్చే విమర్శలకు పూర్తి లైట్ గా తీసుకునే వారు. పైగా వారిని అసలు కేర్ చేసే సీన్ కూడా ఉండేది కాదు. వైసీపీ నేతలు అధికార దర్జాతో పాటు ఇతరత్రా ఆర్భాటలతో టీడీపీని తమకు ప్రత్యర్ధిగా ఏమీ కాదని తీసిపక్కన పెట్టేసేవారు. అయితే సరైన టైం లో టీడీపీకి మంచి విజయం దక్కింది.
అదే టైంలో ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయనగా వైసీపీకి గట్తి షాక్ తగిలింది. అంతే ఇపుడు టీడీపీ బిగ్ షాట్స్ మీడియా ముందుకు వచ్చి సౌండ్ చేస్తున్నాయి. తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే వైసీపీకి గుణపాఠం, చెంపదెబ్బ అని పవర్ ఫుల్ డైలాగులనే వదిలారు. ఏపీలో ఇక మార్పు వచ్చిందని, వైసీపీ సర్దుకోవడం మంచిదని ఆయన కామెంట్స్ చేశారు.
ఏపీలోని విద్యావంతులలో మేధావులు, తటస్థులలో వైసీపీ పాలన పట్ల పూర్తి వ్యతిరేకత ఉందని రుజువు అయిందని అన్నారు. ఉత్తరాంధ్రాలోనే కాదు, వైసీపీకి పట్టుంది అని చెప్పుకునే రాయలసీమలో సైతం టీడీపీ స్కోర్ చేస్తోందని ఆయన అన్నారు. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ సీటులో టీడీపీ దూసుకుపోతోందని, పశ్చిమ రాయలసీమ లో అయితే మెజారిటీ అటూ ఇటుగా ఉన్నా ఫలితం విజయం తమదేనని గంటా అంటున్నారు.
ఏపీలో రాజకీయం మారిందని గంటా ధీమాగా చెబుతున్నారు. తమదే అధికారం, టీడీపీకి మంచి రోజులు అని ఆయన అంటున్నారు. మళ్ళీ చంద్రబాబు పాలన రావాలని యువత కోరుకుంటున్నారు అని అర్ధం అయింది అని ఆయన చెబుతున్నారు. అదే విధంగా ఏపీలో చంద్రబాబు నాయకత్వ పటిమ పట్ల కూడా ఏపీ జనాలకు పూర్తి విశ్వాసం కలిగింది అని ఆయన చెబుతున్నారు.
మరో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే ఉత్తరాంధ్ర జనం జగన్ని చీకొట్టారని పరుష పదజాలమే వాడారు. మీ పాలన మాకొద్దు జగన్ అంటూ ఉత్తరాంధ్ర మొత్తంగా చాటి చెప్పిందని, ఇంతకాలం మభ్యపెడుతూ సాగించిన విద్వేష పాలనకు స్వస్తి వాచకం పలకడానికి జనాలు ఎదురుచూస్తున్నారు అని చెప్పడానికే ఈ ఫలితాలు అని ఆయన అన్నారు.
మొత్తం మీద చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో పెద్ద నాయకులుగా చెప్పుకునే గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు బిగ్ సౌండ్ చేస్తూ వైసీపీతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇంకెంతకాలం జస్ట్ ఏడాది మాత్రమే, గట్టిగా ఓపిక పడితే మనదే రాజ్యం అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశానికి దశ తిరిగేలా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉన్నయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.