Begin typing your search above and press return to search.

గన్నవరం హీట్.. వంశీ సస్పెన్స్.?

By:  Tupaki Desk   |   9 Nov 2019 4:48 PM IST
గన్నవరం హీట్.. వంశీ సస్పెన్స్.?
X
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్ ఇప్పుడు ఏపీ రాజకీయా ల్లో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వంశీ వైసీపీ లో చేర లేదు. జగన్ తో భేటి అయ్యాక టీడీపీ ని వీడుతున్నట్టు ప్రకటించినా ఇంత వరకూ ఆ పార్టీలో చేరలేదు. అలాగని టీడీపీ లోకి వెనక్కి రాలేదు. దీంతో గన్నవరం రాజకీయం రక్తికడుతోంది.

గన్నవరం పాలిటిక్స్ లో మొన్నటి ఎన్నికల ముందు వరకూ యుద్ధమే జరిగింది. ఎమ్మెల్యే వంశీ, అక్కడి వైసీపీ ఇన్ చార్జి యార్లగడ్డ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలున్నాయి. వంశీ రాకను యార్లగడ్డ వ్యతిరేకిస్తున్నారు. అయితే వంశీ వైసీపీ లోకి రాకపోవడం వెనుక కారణాలు మాత్రం అంతు బట్టడం లేదు. ఇటీవలే బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిసిన వంశీ మరి బీజేపీ లోకి వెళుతారా అన్న చర్చ కూడా సాగుతోంది.

వంశీ కనుక వైసీపీ లో చేరితే ఆయన ప్రత్యర్థి అయిన యార్లగడ్డ వైసీపీలో కొనసాగే అవకాశాలు లేవని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇన్నాళ్లు తమను టీడీపీ అధికారం లో ఉండగా ఇబ్బంది పెట్టిన వంశీని వైసీపీ లోకి రానిచ్చేది లేదని వైసీపీ కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ఇటు టీడీపీ కార్యకర్తలు సైతం వంశీ వెళుతారా ఆయన తో పాటు వెళ్లాలా అని డోలాయమానం లో పడ్డారు.

ఇలా కొద్ది రోజులుగా వంశీ ఊగిసిలాట వల్ల గన్నవరంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొందట.. ఏ పార్టీలో ఉండాలో జంప్ కావాలో తెలియక సతమతమవుతున్నట్టు తెలిసింది.