Begin typing your search above and press return to search.

హీరోయిన్ పై కన్నేసిన నయీం!

By:  Tupaki Desk   |   14 Aug 2016 3:31 AM GMT
హీరోయిన్ పై కన్నేసిన నయీం!
X
గ్యాంగ్ స్టర్ నయీం తో రాజకీయనాయకులకు, పోలీసు పెద్దలకు, పారిశ్రామికవేత్తలకు, బడా బడా వ్యాపారస్తులకు సంబందాలు, ఇబ్బందులూ ఉన్నాయని ఇప్పటికే చాలా విషయాలు తెలిసిన నేపథ్యంలో.. తాజాగా సినిమా ఇండస్ట్రీతో కూడా నయీం సంబందాలు - చేసిన చేష్టలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఒక ప్రముఖ హీరోయిన్ కి సంబందించిన సుమారు ఆరు ఎకరాల స్థలం విషయంలో నయీం కబ్జా వ్యవహారం జరిపాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. నయీం లోని మరో కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

గ్యాంగ్ స్టర్ నయీం ఒక టాప్ హీరోయిన్ పై కన్నేసినట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలపై టాలీవుడ్ వర్గాలు కూడా చెవులు కొరుక్కుంటున్న నేపథ్యంలో.. దీనికి సంబందించిన విషయాలు ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనంగా ప్రచురించింది. అయితే ఈ కథనం ప్రకారం.. నయీం కు ఈ హీరోయిన్ తో ముందుగా పరిచయం లేకపోయినా.. ఒక వివాద పరిష్కారానికి ఆ హీరోయినే నేరుగా నయీం ని కలిసిందట. నాటి నుంచి నయీం ఈ హీరోయిన్ పై మనసుపడ్డాడని - నువ్వంటే నాకు ఇష్టమని - నీకు ఎంతకావాలంటే అంత ఇస్తానని వేధించేవాడట.

తెలుగు సినిమాలోనే కాకుండా దక్షిణాది బాషాచిత్రాల్లో కూడా నటించిన ఈ హీరోయిన్ పై నయీం కన్ను వేశాడని, తీవ్రంగా వేదించాడని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు కొనుక్కున్న ఆ హీరోయిన్ కి - ఆ ఇంటి విషయంలోనే ఒక వివాదం రావడంతో సహాయం కోసం నయీం ని సంప్రదించిందని కొందరు చెబుతుంటే.. ఆమెపై ఇష్టంతో కావాలనే ఈ వివాదంలో నయీం వేలుపెట్టాడని మరికొందరు చెబుతున్నారు. ఆ హీరోయిన్ కు సమస్య వచ్చినప్పుడు ముందుగా ఈ వ్యవహారాన్ని తెలంగాణకు చెందిన ఒక మంత్రి దృష్టికి ఆమె తీసుకుని వెళ్లిందని, ఈ విషయం తెలుసుకున్న నయీం తానే స్వయంగా ఈ సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చాడని చెబుతున్నారు. అలా ఆమెతో పరిచయం పెంచుకున్న నయీం.. నిత్యం ఫోన్స్ చేస్తూ వేదించేవాడట. ఈ వేదింపులు బరించలేకే.. హైదరాబాద్ నుంచి ఆ హీరోయిన్ మాకాం మార్చినట్లు కూడా చెబుతున్నారు!!