Begin typing your search above and press return to search.

కొత్త కోణం; నయిం ఆడ వేషాలు..

By:  Tupaki Desk   |   14 Aug 2016 4:37 AM GMT
కొత్త కోణం; నయిం ఆడ వేషాలు..
X
బతికున్నప్పుడు బయటకు రాని గ్యాంగ్ స్టర్ నయింలోని చాలా కోణాలు ఇప్పుడు చనిపోయిన తర్వాత బయటకు వస్తున్నాయి. బెదిరింపులు.. సెటిల్ మెంట్లు చేస్తుంటాడన్న ఆరోపణలు అతడి మీద ఉన్నా.. అతని నెట్ వర్క్ ఎంత పెద్దదో.. అతగాడు సాగించిన దందా ఎంత పెద్దదన్న విషయంలోబయటకు వస్తున్న విషయాలు ఇప్పుడు అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. నయిం దందాలు ఇంత భారీగా ఉంటాయా? అనిపించేలా అతడికి సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. నయింకు సంబంధించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నపోలీసులు.. ఈ సందర్భంగా ఆయా ఇళ్లల్లో సునిశితంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డైరీలు.. డాక్యుమెంట్లతో సహా చాలానే వస్తువుల్ని సీజ్ చేశారు. ఇలా స్వాధీనం చేసుకునే సమయంలో నయింకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆడ వేషంలో ఉన్న నయిం అచ్చు అమ్మాయి మదిరి అలంకరించుకొని.. తలలో పూలు పెట్టుకొని.. ఒంటిమీద నగలు వేసుకొన్న ఫోటో ఏ సందర్భంలో తీసిందో తెలియకున్నా.. ఈ వేషం చూస్తే అతగాడ్ని గుర్తించటం చాలా కష్టంగా ఉండటం గమనార్హం.

ఆడ వేషం వేసిన నయిం.. ఆడవాళ్ల మాదిరి హావభావాలు.. నడకను ప్రాక్టీసు చేసినట్లు చెబుతున్నారు. ఏదైనా డీల్ విషయంలో మస్కా కొట్టేందుకో.. లేక ఇంకే కారణం చేతనో అతగాడు వేసిన ఆడ వేషం ఇప్పుడు అనేక సందేహాలకు అవకాశం ఇస్తోంది. ఆడ వేషంలో నయిం పలు చోట్లకు తిరిగేవాడని.. తన ప్రత్యర్థులకు మస్కా కొట్టేందుకు.. తన ఉనికి తెలీకుండా ఉండేందుకు ఈ తీరులో వ్యవహరించి ఉండేవాడన్న మాట వినిపిస్తోంది. సిట్ స్వాధీనం చేసుకున్న ఈ ఫోటోను చూసినోళ్లంతా అవాక్కయ్యే పరిస్థితి.