Begin typing your search above and press return to search.

నయీం పోలీసులకిచ్చిన గిఫ్ట్స్ ఇవేనా!?

By:  Tupaki Desk   |   14 Aug 2016 5:24 AM GMT
నయీం పోలీసులకిచ్చిన గిఫ్ట్స్ ఇవేనా!?
X
నయీం ఇంతకాలం తన దందాలను - గ్యాంగ్ స్టర్ వేషాలను కొనసాగించడానికి పోలీసుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో... వాటికి మరింత బలాన్ని చేకూర్చేందుకు నయీం డైరీ ఒకటి వెలుగులోకి వచ్చిందని ప్రముఖ మీడియా సంస్థ ఒక వార్తా కథనం ప్రచురించింది. సుమారు 16ఏళ్లుగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటు పోతున్న నయీం.. పోలీసు శాఖలో పలువురు అధికారులకు 16 ఏళ్లుగా రంజాన్ గిప్టులు అందిస్తూనే ఉన్నాడని, అది కూడా ఏ చాక్లెట్ ప్యాకెట్టో - సేమియా - బిర్యానీయో లేక మరేదో చిన్న చిన్న బహుమతులు కాకుండా... పదులు - వందల సంఖ్యలో ఎకరాల ఎకరాల భూమిని బహుమతిగా అందించాడని ఆ వార్తకథనం సారాంశం. ఈ వార్తాకథనం ప్రకారం ఎస్.ఐ. స్థాయి నుంచి డీజీ స్థాయి వరకూ నయీం అందరికీ అక్రమంగా సంపాదించిన ఆస్తులను చక్కగా పంచిపెట్టాడట.

ఆ కథనం ప్రకారం "పోలీసులు - నయీం" అనుబందంపై నయీం డైరీలో వెలుగుచూసిన అంశాలు ఇవేనట..

* యాదగిరి గుట్టలో డీజీ స్థాయి పోలీస్ అధికారికి నయీం సుమారు 80 ఎకరాలు గిఫ్ట్ గా ఇచ్చాడు.

* ఫిల్మ్ సిటిలో ఎస్ ఐ నుంచి డీజీ స్థాయి వరకూ ఉన్న పోలీసులకు 95 ఎకరాల వెంచర్లు పంచిపెట్టాడు.

* చేవెళ్లలో అడిషనల్ ఎస్పీకి 100 ఎకరాల భూమిని కానుకగా అందించాడు.

* రంగారెడ్డి జిల్లాలో డీఐజీ స్థాయి పోలీస్ అధికారికి సుమారు 12 ఎకరాల భూమిని రాసిచ్చాడు.

* భువనగిరిలో జరిగే ఉరుసు ఉత్సవాలుకు బందోబస్తు నిర్వహించిన పోలీసులకు తనమార్కు బహుమతులు అందించాడు.

* డబ్బులున్న మావోయిస్టు డంపుని నయీం ఓ పోలీస్ అధికారికి చూపించి మాయం చేయించాడు.

* ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారితో కలిసి లిక్కర్ దందా షురూ చేశాడు.

* ఓ ఉన్నతాధికారి బావమరిదితో కలిసి చిట్ ఫండ్ కంపెనీ ని నడుపుతున్నాడు.

* వికారాబాద్‌ లో మరుపల్లిలో 200 ఎకరాల ల్యాండ్ సెటిల్‌‌మెంట్

* శంకర పలిల్లో ఒక డాక్టర్‌ ని బెదిరించి 18 ఎకరాల భూమి స్పాట్ రిజిస్ట్రేషన్

* భువనగిరి ప్రాంతంలో ఒక సీనియర్ అధికారికి 8 ఎకరాల ల్యాండ్ గిఫ్ట్

* మణికొండలో కొంతమంది అధికారులు 40 పాట్ల పంపిణీ.

* పోలీసులతో కలిసి శివరాంపల్లి ప్రాంతంలో 400 ఎకరాల సెటిల్‌ మెంట్

* టెలికం కాలనీలో ఒక సర్కిల్ ఇన్సిపెక్టర్ కు అధునాతన ఇల్లు కట్టించిన ఇవ్వడం.

* రాయదుర్గంలో 65 ఎకరాల భూమి సెటిల్‌ మెంట్

* ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేసిన అధికారి ఒకరికి కానుకగా రెండు ఖరీదైన కార్లు కొనిచ్చాడు.

ఈ రేంజ్ లో నయీం.. పోలీసు అధికారులకు బహుమతులు ఇచ్చాడని ప్రచురితమైన ఈ వార్తాకథనం సంచలనం సృష్టిస్తోంది! అయితే ఈ కథనంలో వాస్తవం ఎంత, అసలు ఈ లీకులు ఎవరినుంచి విడుదలయవుతున్నాయనే దానిపై కొత్త చర్చలు మొదలయ్యాయి!!