Begin typing your search above and press return to search.

వైర‌ల్‌.. వైర‌ల్‌: న‌యిం డెన్ చూశారా?

By:  Tupaki Desk   |   12 Jun 2017 4:50 AM GMT
వైర‌ల్‌.. వైర‌ల్‌: న‌యిం డెన్ చూశారా?
X
ప‌ర‌మ కిరాత‌కుడు.. క‌నిక‌రం అన్న‌ది లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన గ్యాంగ్ స్ట‌ర్ నయింకు చెందిన సంచ‌ల‌న వీడియో ఒక‌టి బ‌య‌టకు వ‌చ్చింది. అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌త‌.. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని.. న‌యిం డెన్‌ కు సంబంధించిన ఆస‌క్తిక‌ర వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఎన్‌ కౌంట‌ర్‌ కు ముందు అత‌డు త‌ల‌దాచుకున్న షాద్ న‌గ‌ర్ మిలీనియ‌మ్ టౌన్ షిప్ లోని ఇంటికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఎన్ కౌంట‌ర్‌ కు ముందు న‌యిం.. ఉనూర్ భాషా ఇంట్లో ఉన్నాడు.ఈ ఇంటికి కాస్త దూరంలోనే ఇత‌గాడి డెన్ ఉన్న‌ట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో త‌నిఖీలు నిర్వ‌హించిన అధికారులు.. ఆ సంద‌ర్భంగా వీడియో తీసిన‌ట్లు చెబుతున్నారు.

తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియోలో న‌యిం డెన్ లో ఉన్న ఆయుధాలను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా తాజా వీడియో చూపిస్తుంద‌ని చెప్పాలి.

తాజా వీడియో చూసిన‌ప్పుడు న‌యిం బెడ్రూంలో పెద్ద ఎత్తున ఆయుధాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తుపాకులు.. తూటాలు.. క‌త్తులు ఈ వీడియోలో క‌నిపించాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ గా ఉన్న న‌యిం గ‌త ఆగ‌స్టులో ఎన్ కౌంట‌ర్ లో హ‌త‌మ‌య్యాడు. ఆ సంద‌ర్భంలోనే అత‌డి డెన్ ను పోలీసులు గుర్తించారు. త‌నిఖీల్లో భాగంగా వీడియో తీశారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. వీడియోను ప‌ది నెల‌ల క్రిత‌మే తీసినా.. తాజాగా బ‌య‌ట‌కు రావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వీడియోను ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ లో ప్ర‌సారం చేశారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/