Begin typing your search above and press return to search.

నయీమ్ పై సినిమా.. వర్మకు గొప్ప ఇన్ పుట్స్!

By:  Tupaki Desk   |   17 April 2019 4:28 PM GMT
నయీమ్ పై సినిమా.. వర్మకు గొప్ప ఇన్ పుట్స్!
X
ఈ రోజుల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుసుకోవాలంటే వారు కూడబెట్టిన ఆస్తుల విలువ బట్టి చెప్పే రోజులివి. సక్రమ మార్గంలోనే కాదు, అక్రమ మార్గంలో సంపాదించిన వారి సత్తానూ ఆస్తులను బట్టే చూస్తున్నారు. ఇటీవలే ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించి మరో సంచలన అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. బహుశా రౌడీయిజం, దందాలు, బెదిరింపులతో ఈ స్థాయిలో సంపాదించిన వారు ఎవరైనా ఉన్నారో లేదో తెలీదు కానీ..నయీమ్ ఆస్తుల విలువ మాత్రం కళ్లు చెదిరే స్థాయిలోఉంది.

ఆ గ్యాంగ్ స్టర్ ఆస్తుల విలువ అక్షరాలా రెండు వేల కోట్ల రూపాయలకు పైనే అని, అతడి దురాగతాల మీద ధర్యాప్తు చేస్తున్న సిట్ తేల్చింది! ఏం చేసి సంపాదించాడు ఈ ఆస్తులు అంటే.. సమాధానం అతడి దందాలోనే ఉంది. బెదిరింపులు, భూ కబ్జాలు - హత్యలు - సెటిల్మెంట్లు… వీటి ద్వారా నయీమ్ ఈ ఆస్తులు కూడ బెట్టినట్టుగా స్పష్టం అవుతోంది.

ఎన్ కౌంటర్లో హతమయ్యాకా నయీం ఆస్తులన్నీ కోర్టు ఆధీనంలోకి వెళ్లాయి. ఆస్తుల్లో వెయ్యి ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు - ఇరవై తొమ్మిది భవనాలు - రెండు కేజీల బంగారం - రెండు కోట్ల రూపాయల క్యాష్ ఉన్నట్టుగా సిట్ అధికారులు తేల్చారు.

ఇక ఆస్తులే కాదు నయీమ్ పై ఉన్న కేసులకూ కొదవలేదు. అతడిపై రెండు వందల యాభై కి పైగా కేసులున్నాయి. వాటిల్లో వందకు పైగా ధర్యాప్తు దశలో ఉన్నాయి. ఈ కేసు గురించి ఈ వివరాలను ప్రకటించిన సిట్.. రెండు నెలల్లో దర్యాప్తును పూర్తి చేయనున్నట్టుగా ప్రకటించింది.

సిట్ ధర్యాప్తులో తేలిన ఈ వివరాలు.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాగా ఉపయోగపడగలవు. నయీం మీదే ఏదో సినిమాను రూపో్ందిస్తున్నట్టుగా ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ. సరిగ్గా అలాంటి సమయంలోనే నయీం మొత్తం దందాల విలువను సిట్ లెక్కలేసి చెప్పింది. ఈ ఇన్ పుట్స్ ను వర్మ బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటాడేమో!