Begin typing your search above and press return to search.

నయీం ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

By:  Tupaki Desk   |   5 Jan 2019 6:44 AM GMT
నయీం ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
X
సినిమాల్లో వేల కోట్లు కొల్లగొట్టే గ్యాంగ్ స్టర్ లను చూస్తుంటాం.. మన పూరి జగన్నాథ్ అయితే గ్యాంగ్ స్టర్ లు లేకుండా ఈ మధ్య సినిమాలు తీయడం లేదు. కానీ రియల్ గ్యాంగ్ స్టర్ నయీంపై మాత్రం ఇంతవరకూ ఎవ్వరూ సినిమా తీయడం లేదు. ఆ మధ్య రాంగోపాల్ వర్మ మొదలుపెట్టినట్టే కనిపించినా ఆ సినిమా అతీగతీ లేకుండా పోయింది. 2016 ఆగస్టు 9 న జరిగిన ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో హతమయ్యాడు.

నయీం హతమయ్యాక మీడియా, అతడి బాగోతాలను పోలీసులు బయటపెట్టారు. ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టాడు.? భూ కబ్జాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా నయీం చీకటి కోణాలు బయటకు రావడంతో అంతా షాక్ అయ్యారు.

తాజాగా నయీం ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అతడి సంపద చూసి పోలీసులు - అధికారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయట.. బడా వ్యాపారవేత్తలకు కూడా ఇన్ని ఆస్తులుంటాయా అని షాక్ అవుతున్నారట..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో నయీం పలు ఆస్తులు కూడబెట్టాడు. తాజాగా నయీం బినామీ ఆస్తుల విలువను ఆదాయపన్ను శాఖ అంచనావేసింది. 1015 ఎకరాల భూములు - లక్షా 67వేల చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు - హైదరాబాద్ - సైబరాబాద్ - రంగారెడ్డి - నల్లగొండ జిల్లాల్లో సుమారు 40 ఇళ్లు - గోవాలో విల్లా - మహారాష్ట్రలో గెస్ట్ హౌస్ - పలు నగరాల్లో షాపింగ్ కాంప్లెక్సులు నయీం బినామీల పేరు మీద ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

ఇక నయీం ఎన్ కౌంటర్ లో మృతిచెందిన షాద్ నగర్ లోని మిలీనియం టౌన్ షిప్ లోని ఇల్లు నయీం బావమరిది సాజిద్ పేరుతో ఉంది. బంధువులు - గ్యాంగ్ సభ్యులే బినామీలుగా నయీం రిజిస్ట్రేషన్లు చేయించినట్లు అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. నయీం ఇంట్లో పట్టుబడ్డ వంటమనిషి ఫర్హాన పేరు మీదునే 30-40ఇళ్లు - ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఉండడం విశేషంగా చెప్పవచ్చు.

ఈ మొత్తం నయీం ఆస్తుల విలువ దాదాపు రూ.1200 కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేశారు. బహిరంగ మార్కెట్ లో ఆస్తుల విలువ దాదాపు మూడు రెట్లు ఉంటుందని సమాచారం. కిడ్నాపులు, బెదిరింపులు, సెటిల్ మెంట్ల ద్వారానే ఇన్ని ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఆస్తులన్నింటిని ైటీ అధికారులు అటాచ్ చేసుకోనున్నారు. కేంద్రంలోని ఈడీ కూడా నయీం ఆస్తులపై కేసు దర్యాప్తు చేస్తోంది.