Begin typing your search above and press return to search.

'గంగానది' మృతదేహాలపై కచ్చితమైన సమాచారం లేదు: పార్లమెంట్ లో జలశక్తి మంత్రి

By:  Tupaki Desk   |   8 Feb 2022 7:32 AM GMT
గంగానది మృతదేహాలపై కచ్చితమైన సమాచారం లేదు: పార్లమెంట్ లో జలశక్తి మంత్రి
X
కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఎంతోమంది ప్రాణాలను బలిగొంది. వైరస్ ను సరిగ్గా అంచనా వేయకపోవడంతో చాలా మంది శరీరాల్లోకి ఈ మహమ్మారి ప్రవేశించి అమాయకుల ప్రాణాలను తీసుకుంది. అయితే ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరం ఉండగా దాని కొరత ఏర్పడడంతో ఆయా ఆసుపత్రుల్లో ప్రాణాలు నిలబడలేకపోయాయి. ఇదిలా ఉండగా అవసరమున్నవారికి ఆక్సిజన్ అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వచ్చాయి. ఇక యూపీ, బీహార్ మధ్యలో ప్రవహించిన గంగానదిలో కరోనా మృతదేహాలు తేలడం అప్పట్లో కలకలం రేపింది. ఈ మృతదేహాలు ఎక్కడివో తెలపాలని యూపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇందులో భాగంగా తాజాగా మంగళవారం పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రియన్ దానికి సంబంధించిన వివరాలు తెలపాలని డిమాండ్ చేశారు.

తృణమూల్ ఎంపీ అడిగిన ప్రశ్నకు జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్ బదులిచ్చారు. గంగానదిలో కొవిడ్ మృతదేహాలపై ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారం లేదన్నారు. క్లెయిమ్ చేసుకోనివి, సగం కాలిన మృతదేహాలు, పూర్తిగా కాలినవి నదీలో తేలాయని తెలిపారు. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్ జిల్లాలో ఈ ఘటనలు జరిగాయని తెలిపారు. డిస్పోజ్ చేసిన మృతదేహాలకు సంబంధించిన వివరాల కోసం ఆయాన రాష్ట్రాలను సంప్రదించామన్నారు. జలశక్తి మంత్రి బిజేశ్వర్ వివరణపై టీఎంసీ ఎంపీ మాట్లాడుతూ కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం మృతదేహాలను తొలగించడానికి, వాటిని పారవేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కచ్చితమైన సమాచారం కావాలని పట్టుబట్టాడు.

దేశంలో సెకండ్ వేవ్ ను పూర్తిగా అంచనా వేయకపోవడంతో చాలా మంది చనిపోయారని, దీంతో కొందరు ఆసుపత్రుల్లో కాకుండా వివిధ ప్రదేశాల్లో కరోనాతో మరణించారన్నారు. అందువల్ల చాలా మంది కరోనా కేసుల కింద క్లెయిమ్ చేసుకోలేదన్నారు. దీంతో ఆ మృతదేహాలపై ప్రభుత్వంపై సరైన కౌంటింగ్ లేదన్నారు. గత సంవత్సరం ఏప్రిల్-మే రెండో కొవిడ్ విజృంభించింది. ప్రతి రోజుల దాదాపు లక్షలకు పైగానే కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాలు కూడా అధికంగానే జరిగాయి. అయితే కొని ఆసుపత్రుల్లో కరోనా కేసులు వచ్చినా వాటిని ప్రభుత్వ లెక్కల కింద చూపలేదు. అధికంగా మరణాలు సంభవించినా వాటిని దాచారన్న ఆరోపణలు వచ్చాయి. ఇంకొందరు ఆసుపత్రి యాజమాన్యాలు ఇలా గంగానదిలో మృతదేహాలు పడేశారని ఆరోపణలు వచ్చాయి.

ఉత్తరప్రదేశ్లోని హమీర్ పూర్, బీహార్లోని బక్సార్ జిల్లాలో ప్రవహిస్తున్న గంగారనితో ఈ దృశ్యాలు కనిపించడం ఆందోళన రేకెత్తించింది. కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేసే శ్మశానాలు లేకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆ మృతదేహాలను ఖననం చేసేందుకు నిరాకరించడంతో ఈ మృతదేహాలను గంగానదిలో పడేశారని అన్నారు. గంగానదిలో మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు మృతదేహాలే కనిపించడం గమనార్హం. అయితే హమీర్ పూర్, కాన్పూర్ జిల్లాలోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం, పూడ్చడం చేయరని ఇలా నదిలో పడవేస్తారని హమీర్ పూర్ పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో 150 వరకు మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ మృతదేహాలకు ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ హైకోర్టులో విచారణ చేయించాలన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సైతం ఈ మృతదేహాల విషయంలో ఆందోళన చేశారు. అయితే టీఎంసీకి చెందిన ఎంపీ పార్లమెంట్లో తాజాగా చర్చకు తెరలేపడంతో జలశక్తి మంత్రి వివరణ ఇచ్చారు. కానీ సరైన వివరణ కావాలని టీఎంసీ ఎంపీలు ఆందోళనకు దిగారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనికి బాధ్యత వహించదని తెలిపారు. అవి కచ్చితంగా కొవిడ్ మృతదేహాలని చెప్పలేమని, అధికారుల నుంచి తెప్పించి వివరాల ప్రకారం ఇతర మృతదేహాలు కూడా ఉన్నాయని అన్నారు.