Begin typing your search above and press return to search.

ప్రకాశం జిల్లాలో గ్యాంగ్ వార్ లా యువకుల కొట్లాట

By:  Tupaki Desk   |   20 Jun 2020 12:30 PM IST
ప్రకాశం జిల్లాలో గ్యాంగ్ వార్ లా యువకుల కొట్లాట
X
సినిమాల్లో చూసే గ్యాంగ్ వార్ లు ఇప్పుడు ఏపీలో తరుచుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని బెజవాడలో ఇటీవల రెండు గ్యాంగులు కొట్టుకొని ఒక రౌడీ చనిపోవడం కలకలం రేపింది. ఒకప్పుడు ఎంతో పేరున్న బెజవాడలో రౌడీయిజం మరోసారి అక్కడ వెలుగుచూసింది. ఆ సంఘటన మరిచిపోకముందే ప్రకాశం జిల్లాలో మరో గ్యాంగ్ వార్ వెలుగుచూసింది. యువకులు కొట్టుకున్న తీరు చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో యువకుల మధ్య ఘర్షణ గ్యాంగ్ వార్ ను తలపించింది. మద్యం మత్తులో కొంతమంది యువకులు స్థానిక 10వ వార్డుకు చెందిన రామిరెడ్డి అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపింది.

ఇక తమ నేత రామిరెడ్డిపై యువకులు దాడి చేశారని తెలుసుకున్న కాలనీ వాసులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఏకమై యువకులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. ఇద్దరు యువకులను వీధిలో తిప్పుతూ తాళ్లతో కట్టి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

ఇలా ప్రకాశంలో మద్యం మత్తులో యువకుల వీరంగం గ్యాంగ్ వార్ ను తలపించింది. కాలనీ వాసులంతా తిరగబడడంతో వీరి ఆటకట్టైంది. ఈ దాడిలో ఒక అమాయకపు నేత తీవ్రగాయాలపాలయ్యాడు.