Begin typing your search above and press return to search.
మార్కెట్ యార్డు లో గ్యాంగ్ వార్!
By: Tupaki Desk | 22 Nov 2020 12:30 PM ISTనెల్లూరు మార్కెట్ యార్డు రక్తసిక్తం అయ్యింది. రెండు గ్యాంగ్‌లు రెచ్చిపోయాయి. కత్తులు రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. అది గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు ఖంగుతున్నారు. అది నిజం కొట్లాట కాదని.. ఓ షార్ట్‌ఫిలిం తీసేందుకు చేసిన హడావిడి అని గమనించి షాక్ అయ్యారు. ఏది ఏమైనా న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రజలును భయభ్రాంతులకు గురిచేసినందుకు అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులను, ఆ షార్ట్ ఫిలిం తీస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు.
‘మద్రాస్ బస్టాండ్’ పేరుతో కొందరు షార్ట్‌ఫిలిం తీయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కొందరు జూనియర్ ఆర్టిస్టులను కూడా పిలిపించారు. అయితే సన్నివేశాలు చాలా సహజంగా రావాలనే ఉద్దేశంతో ఏకంగా నెల్లూరు మార్కెట్లోనే షూటింగ్ చేశారు. ఇక్కడ షూటింగ్ జరుపుతున్నట్టు ప్రజలకు, పోలీసులకు సమాచారం అందించలేదు. దూరంగా కెమెరాలు పెట్టి దృశ్యాలను చిత్రీకరించారు. అయితే ఆర్టిస్టులు ఎంతో సహజంగా కొట్టుకుంటున్నట్టు నటించడంతో స్థానికులు బెదిరిపోయారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు జూనియర్ ఆర్టిస్టులను లోపలేసి నాలుగు తగిలిస్తే అసలు విషయం చెప్పారు.
ఎక్కడ షూటింగ్ చేయాలనుకున్నా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని.. ఇష్టారాజ్యంగా షూటింగ్‌లు చేస్తూ ప్రజలను ఇబ్బందికి గురిచేయడం సరికాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో షార్ట్ఫిలిమ్స్, ఫ్రాంక్ వీడియోలు తీసేవారి సంఖ్య ఎక్కువైంది. వీరు ఎవరికి ఇబ్బందులు లేకుండా షూటింగ్ చేసుకుంటే నష్టం లేదు కానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ వారి ప్రైవసీకి భంగం కలిగించడం సరికాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫ్రాంక్ వీడియోలు చేసి కొందరు అమ్మాయిలను వేధిస్తున్నారని ఈ మధ్య ఇటువంటి కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరిస్తున్నారు.