Begin typing your search above and press return to search.

శాపం అంటే ఇదేనేమో.. ఒకరనుకొని మరొకరిని చంపిన గ్యాంగ్​

By:  Tupaki Desk   |   25 Sept 2020 9:15 AM IST
శాపం అంటే ఇదేనేమో.. ఒకరనుకొని మరొకరిని చంపిన గ్యాంగ్​
X
వాళ్లు కరడుగట్టిన నేరగాళ్లు.. సుపారీ తీసుకోవడం, మనుషులను చంపడం వారివృత్తి. కేవలం డబ్బులు ఇస్తే ఎవరి ప్రాణం తీయడానికైనా ఈ గ్యాంగ్​ రెడీగా ఉంటుంది. అయితే రీసెంట్​గా ఓ వ్యక్తిని చంపేందుకు ఈ గ్యాంగ్ డబ్బు తీసుకుంది. ముఠా పక్కా స్కెచ్​ వేసి చంపాలనుకున్న వ్యక్తి ఇళ్లు, తరచూ తిరిగే ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారు. అతడు వాడే బైక్​ కలర్​, బైక్​ నంబర్​ నోట్​చేసుకున్నారు. టార్గెట్​ వ్యక్తిని హత్యచేసేందుకు పక్కా టైమ్​ ఫిక్స్​ చేసుకున్నారు. కానీ ఓ చిన్నపొరపాటుతో వాళ్లు లెక్కతప్పారు. ఒకరిని చంపబోయి.. మరో అమాయకుడని పొట్టనబెట్టుకున్నారు.

ఇంతకూ ఏం జరిగింది..
హైదరాబాద్​లోని షాహిన్​ నగర్​కు చెందిన పరాన్​ గతంలో పలువురిని మోసం చేశాడు. తనకు సబ్బుల ఫ్యాక్టరీ ఉందని నమ్మించి కొంతమందిని మోసం చేశాడు. వారి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు. దీంతో అతడి మీద పహాడీషరీఫ్​ పీఎస్​లో కేసు కూడా నమోదైంది. అయితే ప్రస్తుతం పరాన్​ పరారీలో ఉన్నాడు. అయితే అతడి చేతిలో మోసపోయిన కొందరు పరాన్​పై తీవ్రంగా కోపం పెంచుకున్నారు. అతడిని ఎలాగైనా చంపాలని డిసైడ్​ అయ్యారు. ఇందులో భాగంగా సుపారీ ఇచ్చారు. పరాన్​ చంపేందుకు నిందితులు స్కెచ్​ వేశారు. అతడి ఇంటి సమీపంలో కాపు కాసి కూర్చున్నారు.

ఈక్రమంలో మంగళవారం రాత్రి పరాన్​ ఇంటికి అతని స్నేహితులు షాహిన్ సయ్యద్ మోమిన్ అలీ(24), ఖాలెద్ వచ్చారు. వీరంతా రాత్రంతా ఫుల్లుగా మందు తాగారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున పరాన్​ తనకు ఆకలిగా ఉందని తినడానికి ఏమన్నా తీసుకురావాలని ఫ్రెండ్స్​కు చెప్పాడు. దీంతో సయ్యద్ మోమిన్ అలీ(24), ఖాలెద్ బయటకు వచ్చారు. అయితే మార్గ మధ్యంలో వారిని గ్యాంగ్ వాహనం ఫాలో అయ్యింది. కొద్దిసేపటికి ఆ వాహనంలో నంచి నలుగురు కిందకు దిగారు. వారు మోమిన్​ అలీపై కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే పరాన్​గా భావించిన నిందితులు మోమిన్​ ను హత్య చేశారని పోలీసులు చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
పరాన్​ చేతిలో మోసపోయిన బాధితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక వాళ్లు ఎవరికైనా సుపారీ ఇచ్చి హత్యచేయించేందుకు ప్లాన్​ చేశారా? అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.