Begin typing your search above and press return to search.

బాలికపై గ్యాంగ్ రేప్: క్లారిటీ ఇచ్చిన కేటీఆర్, హోంమంత్రి మనవడు

By:  Tupaki Desk   |   4 Jun 2022 2:29 AM GMT
బాలికపై గ్యాంగ్ రేప్: క్లారిటీ ఇచ్చిన కేటీఆర్, హోంమంత్రి మనవడు
X
హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఘటన తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. మైనర్ బాలికపై లైంగికదాడి సంచలనమైంది. ఈ ఘటనపై డీసీపీ జోయల్ డేవిస్ శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. హోంమంత్రి మనవడు ఈ గ్యాంగ్ రేప్ లో ఉన్నాడనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలో హోంమంత్రి మనవడు ఎక్కడా కనిపించలేదని డీసీపీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో హోంమంత్రి మనవడు ఎక్కడా కనిపించలేదని డీసీపీ తెలిపారు.

మే 28న గ్యాంగ్ రేప్ జరిగితే.. మే31న బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారని డీసీపీ తెలిపారు. గ్యాంగ్ రేప్ కారణంగా బాలిక రెండు రోజుల పాటు షాక్ లో ఉందని.. అందులో ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాలికకు మహిళా కానిస్టేబుళ్లతో కౌన్సిలింగ్ ఇప్పించామని తెలిపారు. ఆ తర్వాతే తనపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పిందన్నారు. వారిలో ఒక్కరి పేరు మాత్రమే బాలిక చెప్పిందని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన ఐదుగురు నిందితులను గుర్తించామని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. వారిలో ఇద్దరు మేజర్లు కాగా.. ముగ్గురు మైనర్లు అని తెలిపారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లోగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. మరో మైనర్ నిందితుడిని అతడి కుటుంబ సభ్యుల కస్టడీలోనే ఉంచామని తెలిపారు. మిగిలిన ముగ్గురు నిందితులను 48 గంటల్లోగానే అదుపులోకి తీసుకుంటామని డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు లేవని తెలిపారు.

బాలికపై గ్యాంగ్ రేప్ దిగ్బ్రాంతికి గురిచేసిందని.. మంత్రి కేటీఆర్ తెలిపారు. వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను కోరారు. ఇది అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ కేసులో ఎవరితో సంబంధాలున్నా సరే ఉపేక్షించరాదని కేటీఆర్ స్పష్టం చేశారు.

అమ్మేషియా పబ్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను హోంమంత్రి మహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ ఖండించారు. ఈ గ్యాంగ్ రేప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం రాత్రి తెలిపారు. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా చెబుతున్న రోజున తాను మినిస్టర్స్ క్వార్టర్స్ లోనే ఉన్నానని తెలిపారు.

తాను ఆరోజు ఎవరికీ పార్టీ ఇవ్వలేదన్నారు. పార్టీలో పాల్గొన్న వారు తనకు ఎవరూ తెలియదని క్లారిటీ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేసే వారు నిజాలు తెలుసుకోవాలని సూచించారు.