Begin typing your search above and press return to search.

బాలిక‌ను రేప్ చేశారు.. త‌ర్వాత దానిని మించిన ఘోరానికి పాల్ప‌డ్డారు.. మ‌న ద‌గ్గ‌రే!

By:  Tupaki Desk   |   14 Nov 2022 4:39 PM GMT
బాలిక‌ను రేప్ చేశారు.. త‌ర్వాత దానిని మించిన ఘోరానికి పాల్ప‌డ్డారు.. మ‌న ద‌గ్గ‌రే!
X
బిహార్లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలిక‌పై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయినా.. వారి క‌సి తీర‌లేదో.. లేక మ‌రేమో తెలియ‌దు కానీ, అత్యంత దారుణంగా శాడిస్టుల మాదిరిగా వ్య‌వ‌హ‌రించారు. గ్యాంగ్ రేప్ అనంత‌రం బాలిక‌ ప్రైవేట్ భాగాలు, నాలుకను కోసేశారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బిహార్ రాష్ట్రం సమస్తిపుర్ జిల్లాలో చెప్ప‌డానికి కూడా మాట‌లు రాని ఈ ఘోర దారుణం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స‌మ‌స్తిపూర్ జిల్లాలోని కళ్యాణ్పుర్ ప్రాంతానికి చెందిన బాలికను కొంద‌రు వ్య‌క్తులు ఈ నెల 11 అంటే మూడు రోజుల కింద‌ట‌ ఇంటిలో నుంచి ఎత్తుకెళ్లిపోయారు. పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ప‌దే ప‌దే చిన్నారిపై గ్యాంప్ రేప్ చేవారు. అంత‌టితో వ‌ద‌ల‌ని కామాంధులు బాధితురాలి ప్రైవేట్ భాగాలు, నాలుకను కోసేసి.. విచక్షణా రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘ‌ట‌న‌లో బాలిక అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకుంది. బాలికను గమనించిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విరాళాలు సేకరించి బాలికకు వైద్యం చేయిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె పరిస్థతి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీపీఐ నేతలు.. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను పోలీసులు త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అత్యాచార ఘటనపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.