Begin typing your search above and press return to search.

దళిత యువతి పై గ్యాంగ్ ​రేప్​.. డ్రగ్స్​ ఇచ్చి - కాళ్లు - వెన్నెముక విరగ్గొట్టి..

By:  Tupaki Desk   |   1 Oct 2020 1:40 PM IST
దళిత యువతి పై గ్యాంగ్ ​రేప్​..  డ్రగ్స్​ ఇచ్చి - కాళ్లు - వెన్నెముక విరగ్గొట్టి..
X
యూపీలో మృగాళ్ల ఆగడాలకు అడ్డు, అదుపులేకుండా పోతోంది. ఇప్పటికే హత్రాస్​లో ఓ దళిత యువతిని దారుణంగా హింసించి, లైంగికదాడి చేసిన చంపేసిన ఘటన మరువకముందే, దానిపై ఆందోళనలు కొనసాగుతుండగానే మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఈ సారి బలరాంపూర్​ జిల్లాలో మరో దళిత యువతి కామాంధుల దాష్టీకాలకు బలైపోయింది. కళాశాల ఫీజు కట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థినిని కిడ్నాప్​ చేసి, బలవంతంగా డ్రగ్స్​ ఇచ్చి.. వెన్నుపూస, చేతులు కాళ్లు విరిగేలా కొట్టి.. తీవ్రంగా హింసించిన దుర్మార్గులు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు.

అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వరుస ఘటనలపై దళితసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాలు నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నాయి.
బలరాంపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి(22) సమీపంలోని ఓ పట్టణంలో బీకాం సెకండియర్​ చదువుతోంది. మంగళవారం కాలేజీ ఫీజు కట్టేందుకు వెళ్లింది. దీంతో మార్గమధ్యంలో కొంతమంది ఆమెను కిడ్నాప్​ చేశారు. అనంతరం సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఓ రిక్షాలో ఆమెను ఇంటికి పంపించారు.

అపస్మారక స్థితిలో ఉన్న కూతురును చూసి తల్లిదండ్రుల షాక్​ అయ్యారు. అనంతరం ఆమెను సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ కేసులో ఇప్పటికే బలరాంపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే బాధితురాలి కాళ్లు, వెన్నెముక విరిచేసారనే ఆరోపణను పోలీసులు ఖండించారు. పోస్ట్​మార్టం రిపోర్ట్​లో అటువంటిది బయటపడలేదని తేల్చిచెప్పారు. మరోవైపు ఈ ఘటనపై దళితసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నాయి.