Begin typing your search above and press return to search.

పీవీపీపై భ‌గ్గుమ‌న్న బండ్ల

By:  Tupaki Desk   |   5 Oct 2019 12:54 PM GMT
పీవీపీపై భ‌గ్గుమ‌న్న బండ్ల
X
ఏపీ ముఖ్య‌మంత్రికి అతి స‌న్నిహితులం అని చెప్పుకునే కొంత మంది ఇండ‌స్ట్రీ వాళ్ల‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ న‌టుడు.. నిర్మాత బండ్ల గ‌ణేష్ సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా నిర్మాత‌.. విజ‌య‌వాడ వైకాపా నేత‌ పీవీపీపై విరుచుకుప‌డ‌టం హాట్ టాపిక్ గా మారింది. పేరు చెప్ప‌కుండా పీవీపీ అని తెలిసేట్టుగా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా బండ్ల గ‌ణేష్ చేసిన ట్వీట్ లు మీడియాలో వైర‌ల్‌గా మారాయి. పీవీపీ పేరుని బ‌య‌ట‌పెట్ట‌కుండానే అతనిపై చిర్రుబుర్రు అంతా ట్వీట్ ల రూపంలో బండ్ల బ‌య‌ట‌పెట్టేశాడు.

దుర్గ‌మ్మ ఆశీస్సుల‌తో విజ‌య‌వాడ ప్ర‌జ‌లు ఎంత అదృష్ట‌వంతులో అర్థ‌మ‌వుతోంది. అమ్మో చిన్న పొర‌పాటు జ‌రిగి వుంటే ఘోర ప్ర‌మాదం జ‌రిగిపోయేది. తొమ్మిదేళ్ల పాటు త‌న ర‌క్తాన్నిప‌ణంగా పెట్టి చెమ‌ట‌ని చిందించి రాత్రన‌కా ప‌గ‌ల‌న‌కా కుటుంబానికి దూరంగా గ‌డిపి చేజిక్కించుకున్న అధికారాన్ని.. వ‌ర్కింగ్ డేకీ .. కాల్షీట్ కు మామూలు షీట్ కు.. మేక‌ప్ కీ ప్యాక‌ప్ కీ తేడా తెలియ‌ని కొంద‌రు స్కామ్ రాజాలు ఇండ‌స్ట్రీని భ్ర‌ష్టు ప‌ట్టించారు. తీసిన ప్ర‌తి హీరోతోనూ గొడ‌వ‌లే. మాట్లాడితే కోర్టులు.. కేసులు. ఇండ‌స్ట్రీకి హిట్ లు, బ్లాక్ బ‌స్ట‌ర్ లు ఇవ్వ‌డం తెలుసు కానీ కోర్టుల చుట్టూ తిర‌గ‌డం కొత్త‌గా నేర్పాడు ఈ స్కామ్ రాజా.. అంటూ బండ్ల ఫైర‌య్యారు.

ప్ర‌పంచంలో నేను ఏదేశానికైనా వెళ్లి హ్యాపీగా రితిగి వ‌స్తా కానీ.. కొంద‌రు స్కామ్ రాజాలు విదేశాలు వెళితే అరెస్టు చేసి బొక్క‌లో వేస్తార‌ట‌. అంద‌రూ చెప్పుకుంటుంటే విన్నా. నిజ‌మో కాదో నాకు తెలియ‌దు. కొంద‌రు దుర్మార్గుల‌కు పెత్త‌నాలు ఇచ్చి మీ కీర్తిని పాడుచేసుకోవ‌ద్ద‌ని గౌర‌వ‌నీయులు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గారికి నా విన‌య‌పూర్వ‌క విన్న‌పం... అని బండ్ల పీవీపీపై విరుచుకుప‌డ్డారు. ఈ దేశం.. ప్ర‌పంచం మొత్తం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుడు.. ప‌ద్మ‌శ్రీ‌ క‌మ‌ల్ హాస‌న్ గారినే కోర్టుకు లాగిన నీచ చ‌రిత్ర నీది!! అంటూ బండ్ల గ‌ణేష్ పీవీపీపై ఇండైరెక్ట్ గా దునుమాడ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఆర్థిక వ్య‌వ‌హారాల్లో వ‌చ్చిన గొడ‌వ కాస్తా ఇలా దూషించుకునేవ‌ర‌కూ వెళుతోంద‌ని స‌న్నివేశం చెబుతోంది.