Begin typing your search above and press return to search.

గాంధీ మునిమ‌న‌వ‌రాలిని చూస్తే షాకే!

By:  Tupaki Desk   |   22 Aug 2017 8:49 AM GMT
గాంధీ మునిమ‌న‌వ‌రాలిని చూస్తే షాకే!
X
మీరు క‌ల‌లో కూడా ఊహించ‌లేనిది. జాతిపిత మ‌హాత్మాగాంధీకి మునిమ‌న‌వ‌రాలికి సంబంధించిన సంగ‌తి ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది. ఈ ఫోటోలో స‌ర్కిల్ గీసిన అమ్మాయి గాంధీ మునిమ‌న‌వ‌రాలు. ఆమె పేరు మేధా గాంధీ. ఆమె వ‌స్త్ర‌ధార‌ణ‌.. ఆమె ఎంచుకున్న వృత్తి చూస్తే.. జాతిపిత మునిమ‌న‌వ‌రాలా? అని నమ్మ‌లేని ప‌రిస్థితి. ఇంత‌కీ.. ఆమె ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? ఆమె ఇప్పుడు ఎందుకంత సంచ‌ల‌నంగా మారారు? అన్న విష‌యాల్లోకి వెళితే..

గాంధీ మ‌న‌మ‌డి పేరు కాంతిలాల్ గాంధీ. ఆమె కుమార్తే.. ఈ మేధాగాంధీ. గాంధీ చ‌నిపోయిన త‌ర్వాత ఆయ‌న కుటుంబ స‌భ్యులు కొంద‌రు అమెరికాలో స్థిర‌ప‌డ్డారు.అలా స్థిర‌ప‌డిన వారి కుటుంబాల‌కు చెందినదే మేధాగాంధీ. ఆమె పుట్టించి అమెరికాలోనే. పెరిగింది కూడా అక్క‌డే.

ప్ర‌స్తుతం అమెరికాలో ఒక డీజేగా ప‌ని చేస్తూ.. రోడ్ షోలు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ఆమె త‌న స్నేహితుల‌తో క‌లిసి దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం.. ఆమెను గుర్తించి.. ఆమె సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌టంతో ఆమె ఇప్పుడు సోష‌ల్ మీడియా సంచ‌ల‌నంగా మ‌రారు. 71వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆమె స్నేహితుల‌తో క‌లిసి దిగిన ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌టంతో గాంధీ మునిమ‌న‌వ‌రాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.