Begin typing your search above and press return to search.

వజ్రోత్సవాల వేళ తెలంగాణలో ఆ సినిమా ఫ్రీగా ప్రదర్శించాల్సిందే

By:  Tupaki Desk   |   7 Aug 2022 11:00 AM IST
వజ్రోత్సవాల వేళ తెలంగాణలో ఆ సినిమా ఫ్రీగా ప్రదర్శించాల్సిందే
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాల్ని జారీ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వజ్రోత్సవాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. విద్యార్థుల కోసం 'గాంధీ' సినిమాను ఉచితంగా ప్రదర్శించాలని థియేటర్లను కోరింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేశారు.

సాధారణ థియేటర్లు మొదలుకొని మల్టీఫ్లెక్సుల వరకు అన్నింటిలోనూ 'గాంధీ' మూవీని ఉచితంగా ప్రదర్శించాలని కోరింది. ఉదయం 10 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 1.15 గంటల వరకు సదరు చిత్రాన్ని ప్రదర్శించాలని పేర్కొంది. ఈ మూవీని ఈ నెల తొమ్మిది నుంచి 11 వరకు.. 16 నుంచి 21 వరకు అన్ని థియేటర్లలో ఉచిత ప్రదర్శన చేయాలని స్పష్టం చేసింది.

అంతేకాదు.. ఈ మూవీకి సంబంధించిన కాపీని.. డిజిటల్ ఫార్మాట్ చేసి.. ప్రస్తుతం సినిమా థియేటర్లకు సర్వీసు ప్రొవైడర్లుగా వ్యవహరిస్తున్న క్యూబ్.. యూఎఫ్ వోలకు ఈ ప్రింట్ ను అందజేయాలని కోరింది. దీనికి సంబంధించిన బాధ్యతను తెలంగాణ చలన చిత్ర అభివ్రద్ధి సంస్థకు అప్పజెప్పింది. అంతేకాదు.. ప్రభుత్వం పేర్కొన్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఉదయమే ఈ మూవీని ప్రదర్శించాల్సి ఉంటుంది.

నిజానికి.. ఇలాంటి నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటే బాగుండేది. కానీ.. మోడీ సర్కారు కంటే ముందుగా కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. మొత్తానికి మోడీ సర్కారుతో పోటీ పడేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్న కేసీఆర్ సర్కారు అందుకు తగ్గట్లే తీసుకున్న ఈ నిర్ణయం పలువురిని ఆకర్షిస్తుందని చెప్పక తప్పదు.