Begin typing your search above and press return to search.

క‌శ్మీర్ యువ‌త‌పై స్టార్ క్రికెట‌ర్ నిప్పులు

By:  Tupaki Desk   |   13 April 2017 1:37 PM GMT
క‌శ్మీర్ యువ‌త‌పై స్టార్ క్రికెట‌ర్ నిప్పులు
X
జ‌వానుపై క‌శ్మీర్ యువ‌త దాడి చేయ‌డంపై క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు. జ‌వానుపై ప‌డే ఒక్కో దెబ్బ వంద మంది జిహాదీల ప్రాణాల‌ను తీస్తుంది అని హెచ్చ‌రించాడు. క‌శ్మీర్ మాది.. స్వాతంత్ర్యం కావాల్సిన వాళ్లు వెళ్లిపోవ‌చ్చు అని గంబీర్‌ స్ప‌ష్టంచేశాడు. ట్విట్ట‌ర్‌ లో త‌న ఆలోచ‌న‌ల‌ను పోస్ట్ చేస్తూ గంభీర్ ఉద్విగ్న‌భ‌రితంగా స్పందించారు. అంతేకాదు మన త్రివ‌ర్ణ ప‌తాకంలోని రంగుల‌కు అత‌ను కొత్త భాష్యం చెప్పాడు. కాషాయం ఆగ్ర‌హానికి, తెలుపు జిహాదీల మృత‌దేహాల‌పై క‌ప్పే వ‌స్త్రానికి, ఆకుప‌చ్చ ఉగ్ర‌వాదంపై ఉన్న ద్వేషానికి ప్ర‌తీక‌ల‌ని గంభీర్‌ అభివ‌ర్ణించాడు.

బుద్గామ్ జిల్లాలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా సామ‌గ్రిని మోసుకెళ్తున్న ఓ జ‌వానుపై క‌శ్మీర్ యువ‌త దాడి చేస్తున్న వీడియో నెట్‌ లో సంచ‌ల‌నం రేపింది. ఈ వీడియో చూసే గంభీర్ ఇలా తీవ్రంగా స్పందించాడు. యువ‌త త‌న‌పై దాడి చేస్తున్న స‌మ‌యంలో త‌న చేతిలో ఆయుధాలు ఉన్నా.. ఆ జ‌వాను చూపిన స‌హనానికి నెటిజ‌న్లు జోహార్లు ప‌లికారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/