Begin typing your search above and press return to search.

స్టార్ క్రికెటర్ల కొత్త ఇన్నింగ్స్..బీజేపీలోకి ఎంట్రీ?

By:  Tupaki Desk   |   29 Sep 2018 10:15 AM GMT
స్టార్ క్రికెటర్ల కొత్త ఇన్నింగ్స్..బీజేపీలోకి ఎంట్రీ?
X
2019 ఎన్నికలు అంతా ఆషామాషీ వ్యవహారం కాదని బీజేపీ భావిస్తోంది. 2014 నాటి పరిస్థితులు పునరావృతం కావని అంచనావేస్తోంది. ఈసారి మ్యాజిక్ ఫిగర్ కష్టమేనన్న భావన కూడా ఆ పార్టీని ఆందోళన పరుస్తోంది. అందుకే అసమ్మతులు, వ్యతిరేకులకు టికెట్ ఇచ్చి దెబ్బైపోయే బదులు.. వచ్చే ఎన్నికల్లో కొత్త వారికే టికెట్స్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ మేరకు అమిత్ షా కూడా ఇప్పటికే పాత వారిలో సగానికపైగానే టికెట్లు ఇవ్వమని స్ఫష్టం చేశాడట.. బీజేపీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 30 -40శాతం ఎంపీ సీట్లను కొత్త వారితో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

దేశ రాజధాని ఢిల్లీ లోని ఏడు పార్లమెంటు స్థానాల్లో తాజాగా రెండు సీట్లలో భారత క్రికెటర్లు గంభీర్ - సెహ్వాగ్ లను పోటీచేయించాలని బీజేపీ భావిస్తోంది. మిగతా వాటిలో బీహార్ - గుజరాత్ లకు చెందిన వారికి రెండేసి చొప్పున స్థానాలు - ఒక స్థానం రిజర్వ్ చేయాలని భావిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ - కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీచేయాలని నిర్ణయించిన నేపథ్యంలో బీజేపీ ఈ కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకే ప్రజల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఢిల్లీ క్రికెటర్లు సెహ్వాగ్ - గంభీర్ లను బరిలోకి దింపుతున్నట్టు తెలిసింది. వీరిద్దరూ పోటీపడితే.. మిగతా ఎవ్వరూ నిలబడ్డా ఓడిపోతారని బీజేపీ భావిస్తోంది. మరి బీజేపీ ఆశ నెరవేరుతుందా..? గంభీర్ - సెహ్వాగ్ బరిలోకి దిగుతారా లేదా అన్నది వేచిచూడాలి..