Begin typing your search above and press return to search.

గల్లా జయదేవ్ ఎన్నికల చెల్లదా?

By:  Tupaki Desk   |   28 May 2019 1:27 PM GMT
గల్లా జయదేవ్ ఎన్నికల చెల్లదా?
X
ఏపీలో టీడీపీ 25 లోక్ సభ సీట్లలో చచ్చీ చెడి మూడు చోట్ల గెలిచింది. అయితే... అందులో ఒక స్థానం కోల్పోయే ప్రమాదముందున్న వాదన ఒకటి వినిపిస్తోంది. గుంటూరులో తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్ గెలిచినప్పటికీ అక్కడ పోస్టల్ బ్యాలట్ల లెక్కింపుల్ తకరారు జరిగిందని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వైసీపీ డిసైడ్ కావడంతో గుంటూరు సీటు తమ చేతి నుంచి జారిపోతుందా అన్న టెన్షన్ టీడీపీలో మొదలైంది.

గుంటూరు ఎంపీ స్థానంలో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్‌ అధికారి పక్షపాతం ప్రదర్శించారని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఆరోపించడం టీడీపీలో దడ పుట్టిస్తోంది. చిన్న సాంకేతిక కారణం చూపి 9700 ఓట్లను లెక్కించలేదని ఆయన ట్వీటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్వో అక్రమానికి పాల్పడి టీడీపీ 4200 ఓట్లతో గెల్చినట్టు ప్రకటించారని - దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. గుంటూరు లోక్‌ సభ స్థానంలోని సుమారు 9,700 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లున్న కవర్‌ పై 13–సీ నంబరు లేకపోవడంతో వాటిని లెక్కించని విషయం తెలిసిందే.

గుంటూరు లోక్‌ సభ పరిధిలో ఉన్న తాడికొండ - మంగళగిరి - పొన్నూరు - తెనాలి - ప్రత్తిపాడు - ఉత్తర గుంటూరు - దక్షిణ గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క దక్షిణ గుంటూరు మినహా అన్ని స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. కానీ లోక్‌ సభ స్థానంలో మాత్రం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి కాకుండా టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ ను విజయం వరించింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని వైఎస్సార్‌సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి - మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ 9200 పోస్టల్ ఓట్లు లెక్కిస్తే విజయం వైసీపీదే అవుతుందని వారంటున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లడానికి రెడీఅవతున్నారు.

మరోవైపు శ్రీకాకుళం పార్లమెంటు స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 చోట్ల వైసీపీ గెలిచినా లోక్ సభ సీటు మాత్రం టీడీపీ గెలిచింది. ఇక్కడా అధికారులు టీడీపీ అభ్యర్థి రామ్మోహననాయుడుకు అనుకూలంగా వ్యవహరించారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపైనా న్యాయ పోరాటం చేస్తామంటోంది.