Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీతో కలిసి టోక్యోకు ఆ హీరోలు..

By:  Tupaki Desk   |   24 March 2016 10:51 AM GMT
టీడీపీ ఎంపీతో కలిసి టోక్యోకు ఆ హీరోలు..
X
గల్లా జయదేవ్.. వ్యాపార రంగంలోనే కాదు.. పొలిటికల్ ఫీల్డ్ లోనూ బిగ్ షాట్. సినీ రంగంలోనూ ఆయనకు మంచి పరిచయాలే ఉన్నాయి. మహేష్ బాబు సోదరిని పెళ్లి చేసుకున్న గల్లా జయదేవ్ తెలుగు రాష్ట్రాల్లోని బిగ్ షాట్స్ లో ఒకరు. ఆయన తన పుట్టిన రోజు వేడుకల్ని భారీ స్థాయిలో చేసుకోడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల్లోని తన సన్నిహితుల మధ్య జపాన్ రాజధాని టోక్యోలో భారీ ఎత్తున పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు గల్లా జయదేవ్.

తన కుటుంబ సభ్యులతో సహా 60 మంది సెలబ్రెటీలను తీసుకుని ఈ సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో టోక్యోకు బయల్దేరబోతున్నారు గల్లా జయదేవ్. సినీ పరిశ్రమ నుంచి తన బావమరిది మహేష్ బాబుతో పాటుగా రానా దగ్గుబాటి - సుధీర్ బాబు సహా కొందరు సెలబ్రెటీలు జయదేవ్ తో పాటుగా టోక్యోకు వెళ్తున్నారు. ఈ నెల 29 వరకు గల్లా జయదేవ్ పుట్టిన రోజు వేడుకలు కొనసాగబోతున్నాయి. గల్లా జయదేవ్ ఒకప్పుడు వ్యాపారానికి పరిమితమయ్యేవారు. ఆయన తల్లి గల్లా అరుణకుమారి సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేశారు. ఐతే గత ఎన్నికల్లో ఆమె జయదేవ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. జయదేవ్ తన సొంత జిల్లా చిత్తూరును వదిలిపెట్టి.. గుంటూరులో ఎంపీగా పోటీ చేసి గెలవడం విశేషం.