Begin typing your search above and press return to search.

టీడీపీకి గల్లా అరుణ గుడ్ బై చెప్పినట్టేనా?

By:  Tupaki Desk   |   1 Oct 2020 5:30 PM GMT
టీడీపీకి గల్లా అరుణ గుడ్ బై చెప్పినట్టేనా?
X
టీడీపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు గల్లా అరుణ కుమారి సడన్ గా టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకోవడం కలకలం రేపింది. తన వ్యక్తిగత కారణాల వల్లే పార్టీ పొలిట్ బ్యూరోను వీడుతున్నట్లు ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొంది.

వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా గల్లా అరుణకుమారి పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ టీడీపీ తరుఫున గుంటూరు ఎంపీగా నిలబడి వరుసగా రెండు సార్లు గెలిచారు.

ఈ క్రమంలో అరుణకుమారికి గౌరవం ఇచ్చి చంద్రబాబు ఆమె పార్టీకి ప్రధానమైన పొలిట్ బ్యూరలో అవకాశం ఇచ్చారు.

అయితే జగన్ సర్కార్ వచ్చాక గల్లా కుటుంబం ఆస్తులు, ఫ్యాక్టరీలపై నజర్ పెట్టడం.. ఇటీవల చిత్తూరు జిల్లా సెజ్ లో భూమిని రద్దు చేయడం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే గల్లా జయదేవ్ పార్టీలో సైలెంట్ అయ్యారు.ఇక ఇటీవల పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జుల నియామకంలోనూ గల్లా ఫ్యామిలీని బాబు లెక్కలోకి తీసుకోలేదన్న ప్రచారం సాగింది. దీంతో గల్లా అరుణకుమారి పొలిట్ బ్యూరోను వీడినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలు అంటున్న పార్టీలో పరిణామాలు నచ్చకే వైదొలిగినట్టు సమాచారం.