Begin typing your search above and press return to search.

తమ్ముడికి షాక్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి.. సతమణిని రంగంలోకి దించి..

By:  Tupaki Desk   |   7 Feb 2023 6:00 PM GMT
తమ్ముడికి షాక్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి.. సతమణిని రంగంలోకి దించి..
X
కర్ణాటకలో రాజకీయం హీటెక్కుతోంది. వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పార్టీలన్నీ పోటీకి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. తన కంచుకోట బళ్లారిలో ఎలాగైగా పాగా వేయాలని చూస్తున్నాడు. అయితే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో అడుగుపెట్టే అవకాశం లేదు. దీంతో ఆయన తన పార్టీ ద్వారా కుటుంబ సభ్యులను గెలిపించుకొని వారి ద్వారా కార్యకలాపాలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొదట్లో ఆయన తమ్ముడు గాలి సోమశేఖర్ రెడ్డిని తన పార్టీ ద్వారా పోట చేయించాలని అనుకున్నాడు. కానీ ఆయన బీజేపీ జెండాతోనే పోటీ చేస్తానని స్పష్టమైన ప్రకటన చేశాడు. దీంతో గాలి జనార్దన్ రెడ్డి తన సతీమణిని రంగంలోకి దించారు. ఏకంగా తమ్ముడిపైనే పోటీకి సిద్ధం చేస్తున్నారు.

కొంతకాలం బీజేపీలో కీలక నేతగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన 'కల్యాణ రాజ్య ప్రగతి' అనే కొత్త పార్టీని పెట్టారు. రాజకీయంగా తనను దెబ్బకొట్టిన వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కొత్త పార్టీని పెట్టానని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే సొంత పార్టీ పెట్టినా గాలి జనార్దన్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం బళ్లారి లో పోటీ చేసే అవకాశం లేదు. ఒకప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆయన సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బళ్లారిలో అడుగుపెట్టే అవకాశం లేదు.

ఈ నేపథ్యంలో తన తమ్ముడు గాలి సోమశేఖర్ రెడ్డి ని పోటీలో నిలపాలని అనుకున్నారు. కానీ ఇటీవల ఆయన తాను ఎప్పటికీ బీజేపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బళ్లారి సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అన్న జనార్దన్ పార్టీ పెట్టడంపై సంచలన ఆరోపణలు చేశారు. తన అన్న కొత్త రాజకీయ పార్టీ పెట్టి తప్పు చేశారని, రాజకీయాల్లో ఓపిక ఉండాలని హితువు పలికారు.

గాలి జనార్దన్ రెడ్డి తన పార్టీ నుంచి బళ్లారి సిటీకి అభ్యర్థి కచ్చితంగా ఉంటారని అన్నారు. అయితే తన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారని అనుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరుల్లో గాలి కరుణాకర్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన ప్రాణ స్నేహితుడు బళ్లారి శ్రీరాములు మంత్రి హోదాలో ఉన్నారు. అయితే వీరిని కాదని గాలి జనార్దన్ నెడ్డి తన భార్య గాలి లక్ష్మి అరుణను బరిలోకి దించారు.

బళ్లారి సిటి నియోజకవర్గం నుంచి గాలీ లక్ష్మీ పోటీ చేస్తుందని బహిరంగంగానే ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. బళ్లారి సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే సొంత తమ్ముడు గాలి సోమశేఖర్ రెడ్డి కొనసాగుతుండగా.. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి భార్య 'కల్యాణ రాజ్య ప్రగతి' పార్టీ నుంచి పోటీ చేస్తుండడం విశేషం.ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు, కుటుంబం వేరు అని అన్నారు. కుటుంబ కోసం సొంత పార్టీని బరిలో దింపకుండా ఉండలేనని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.