Begin typing your search above and press return to search.

గగన్‌ యాన్ లేటెస్ట్ అప్ డేట్స్...నింగిలోకి ఒక్కరే!

By:  Tupaki Desk   |   8 Jan 2020 8:00 AM GMT
గగన్‌ యాన్ లేటెస్ట్ అప్ డేట్స్...నింగిలోకి ఒక్కరే!
X
గగన్ యాన్ ఇండియా యొక్క తోలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం. ప్రధాని నరేంద్ర మోడీ 2018 జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఢిల్లీలోని ఎర్రకోటలో చెప్పినట్టు గానే 2022లో భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరపుకునే నాటికి మన దేశానికి చెందిన వ్యక్తి ఒకరు అంతరిక్షం లోకి వెళ్లి అక్కడ భారత జెండాను ఎగుర వేయబోతున్నారు. ఈ గగన్‌యాన్ మిషన్ ప్రయోగం పై ఇస్రో చీఫ్ కొన్ని వివరాలని వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

గగన్‌ యాన్ ప్రయోగానికి మొత్తం ఖర్చు రూ.10వేల కోట్లు అవుతుండగా , ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను ఇస్రో పంపనుంది. ఈ నలుగురు కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వారు. అలాగే నలుగురు కూడా పురుషులే అని తెలిపారు. కానీ , నింగిలోకి వెళ్ళేది ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. దానికి ఇంకా టైం ఉంది అని తెలిపారు. ఈ నలుగురిని భూమి నుండి 2000 కిలోమీటర్ల ఎత్తుకు పంపనున్నారు. ఇదిలా ఉంటే అంతరిక్షం లోకి వెళ్లే వారికి జనవరి మూడోవారం నుంచి వారు రష్యాలో శిక్షణ పొందుతారని , అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు రష్యాలో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. అక్కడి వాతావరణం కు అలవాటు పడేలా ట్రైనింగ్ ఇస్తారు. 11 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత భారత్‌ లో వారికి మాడ్యూల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఇస్రో రూపొందించిన మాడ్యూల్స్‌ను ఎలా ఆపరేట్ చేయాలో శిక్షణ ఇవ్వబోతున్నట్టు తెలిపారు.

ఇక, అలాగే మైసూరు లోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబరేటరీ గగన్‌యాన్‌లో ప్రయాణించేవారికి ఆహారం తయారు చేస్తోందని చెప్పారు. అంతేకాదు డీఆర్‌ డీఓ ల్యాబ్స్ కూడా మిషన్ విజయవంతం అయ్యేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నాయని తెలిపారు. ఇక వ్యోమగాములకు స్పేస్‌ సూట్‌ లను కూడా తయారు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి రష్యా సహాయం కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. ఒక వారం రోజుల పాటు అంతరిక్షం లో ఉండేలా ముగ్గురు కోసం మిషన్‌ను తయారు చేస్తున్నామని డాక్టర్ శివన్ చెప్పారు. అయితే ఇద్దరిని పంపుతామా లేక ఒకరిని పంపుతామా అది తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. అమెరికా రష్యా చైనా లాంటి దేశాలు కూడా తొలిసారి అంతరిక్షంలోకి ఒక్క వ్యక్తినే పంపాయని అది కూడా చాలా తక్కువ రోజుల వరకే అక్కడ ఉంచాయని శివన్ గుర్తు చేశారు.

ఇప్పటికే అన్ని హంగుల తో కూడిన గగన్‌ యాన్ స్పేస్‌ క్రాఫ్ట్ డిజైన్ పూర్తయ్యిందని , ప్రస్తుతం పేపర్ వర్క్ పూర్తయ్యిందని చెప్పారు. అలాగే ఈ గగన్ యాన్ అనేది మానవుడు ప్రయాణిస్తున్న స్పేస్‌ క్రాఫ్ట్ కాబట్టి అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని చెప్పారు. అంతేకాదు ఫెయిల్యూర్‌ రేట్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని శివన్ చెప్పారు. ఇదిలా ఉంటే నింగిలోకి వ్యోమగాములను జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 తీసుకెళ్లనుంది. దీనికి బాహుబలిగా అభివర్ణిస్తున్నారు. దీనికి నాలుగు దశల పేలోడ్ ఉండేలా తయారు చేస్తున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌నుంచి ఈ లాంచ్ వెహికల్ టేకాఫ్ తీసుకుంటుందని శివన్ తెలిపారు. ఇక డిసెంబర్ 2021 లోపల గగన్‌ యాన్ మిషన్‌ ను ప్రయోగిస్తామని చెప్పారు. ఇక ఈ మిషన్‌ లో మానవుడిలో పాటుగా ఒక రోబోను కూడా పంపనున్నట్లు చెప్పారు శివన్. హ్యూమన్ రోబో వ్యోమగామి యొక్క బ్లడ్ ప్రెజర్ , హార్ట్ రేట్‌, ఆరోగ్యానికి చెందిన ఇతర పారామీటర్లను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుందని చెప్పారు శివన్.