Begin typing your search above and press return to search.
ప్రమాణం చేసిన రెండో రోజే ప్రతాపాన్ని చూపించారా?
By: Tupaki Desk | 14 Feb 2021 11:45 AM ISTగ్రేటర్ మేయర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే గద్వాల విజయలక్ష్మి అనూహ్య ఆరోపణల్లోకి చిక్కుకున్నారు. ఆమె ప్రమేయం ఎంత ఉందన్నది లెక్క తేలనప్పటికి.. ఆమెను టార్గెట్ చేసేలా సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న ప్రచారం షాకింగ్ గా మారింది. ఇంతకీ జరిగిందేమంటే.. షేక్ పేట తహసీల్దార్ పై బదిలీ వేటు పడింది. దానికి మేయర్ విజయలక్ష్మికి లింకేమిటి? అన్నది ప్రశ్న కదా? అక్కడికే వస్తున్నాం.
షేక్ పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి.. ఇప్పుడు మేయర్ గా ఉన్న విజయలక్ష్మికి గత నెలలో వివాదం చోటు చేసుకుంది. పేదల సర్టిఫికేట్ల జారీ విషయంలో ఆలస్యం చోటు చేసుకోవటంపై ఆగ్రహించిన విజయలక్ష్మి.. కార్పొరేటర్ హోదాలో ఎమ్మార్వో వద్దకు వెళ్లటం.. ఇరువురి మధ్య వాగ్వాదం.. పోలీసు కేసులు పెట్టుకోవటం జరిగాయి. ఇదిలా ఉంటే.. మేయర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండో రోజునే.. ఎమ్మార్వో పై బదిలీకి గురి కావటంతో అదంతా మేయరే చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
అయితే.. పదవీబాధ్యతలు ఇంకా స్వీకరించని మేయర్.. షేక్ పేట లాంటి ప్రాంతానికి ఎమ్మార్వోగా వ్యవహరిస్తున్న అధికారిని బదిలీ చేయించే అవకాశం ఉంటుందా? ఎంత మొండితనంతో ఉన్న వారైనా.. ఆరంభంలోనే వివాదాలతో పదవీ ప్రయాణాన్ని చేపడతారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో భాగమే అయినప్పటికీ. .ఎమ్మెర్వోకు సంబంధించిన అంశాలు పూర్తిగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఉంటాయన్నది మర్చిపోకూడదు. అలాంటప్పుడు.. మేయర్ ను టార్గెట్ చేసేలా వాట్సాప్ లోనూ.. సోషల్ మీడియాలోనూ ఇంత తీవ్రంగా ప్రచారం జరగటం వెనుక ఎవరున్నారు? అన్నది ప్రశ్న.
ఎందుకంటే.. మేయర్ గా విజయలక్ష్మి ఎంపికను ఇష్టపడని వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారి ఆసక్తితోనే మేయర్ ను టార్గెట్ చేసినట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీనివాస్ రెడ్డికి ముందు ఎమ్మార్వోగా వ్యవహరించిన అధికారినే మళ్లీ తీసుకొచ్చి పోస్టు ఇవ్వటం చూస్తే.. బదిలీ వెనుక మరింకేమైనా కారణం ఉండి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. ఒక ఎమ్మెల్యే ఒత్తిడితోనే బదిలీ జరిగిందని.. అదెప్పటి నుంచో ఉన్నా.. మేయర్ ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజులకే అధికారిక ఉత్తర్వులు వెలువడటం.. మేయర్ మీద గుర్రుగా ఉన్న వారు లీడ్ తీసుకొని సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారాన్ని చేపట్టినట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వాదనకు భిన్నంగా ఎక్కువ మంది మాత్రం..ఆరంభంలోనే మేయర్ ఇలాంటి పని చేయటమా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. రానున్న రోజుల్లో మరేం జరుగుతుందో చూడాలి.