Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే భిక్షాటన .. ఆ దుస్థితికి కారణమేంటి ?

By:  Tupaki Desk   |   14 Dec 2020 1:30 PM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్యే భిక్షాటన .. ఆ దుస్థితికి కారణమేంటి ?
X
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలని గత 19 రోజులుగా ఢిల్లీ శివరాల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమం రోజురోజుకి మరింత తీవ్రతరం అవుతుంది. ఇప్పటికే రైతులు భారత్ బంద్ నిర్వహించారు , అలాగే ఈ రోజు నిరాహార దీక్షకి పూనుకున్నారు. ఇక కేంద్రం పై రైతుల చేస్తున్న పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యమైన మద్దతు లభిస్తుంది.

ఇక రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా , రైతుల కోసం భిక్షాటన చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతన్నలకు గద్వాల ఎమ్మెల్యే ఓ భరోసానిచ్చారు. అన్నదాతల కడుపు నింపేందుకు ఎమ్మెల్యే బిక్షాటన చేపట్టారు. జిల్లాలోని మల్దకల్‍ మండలంలో ఎమ్మెల్యే జోలే పట్టుకుని ఇంటింటికి వెళ్లి పిడికెడు చొప్పున బియ్యాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్‍ రెడ్డి మాట్లాడుతూ సేకరించిన ఈ బియ్యాన్ని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు పంపిస్తానని తెలిపారు.

రాష్ట్రంలోని రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‍ రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న తెలంగాణ రైతాంగానికి కేంద్రం తెచ్చిన కొత్త సాగు బిల్లులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్రం కొత్త వ్యవసాయ బిల్లులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‍ చేశారు.