Begin typing your search above and press return to search.
పుతిన్ వియ్యం కోసం ట్రై చేశాడట!
By: Tupaki Desk | 1 Jan 2016 9:53 AM GMTవాద్లిమిర్ పుతిన్ తెలీని వారు ఎవరూ ఉండరు. తన వివాదాస్పద వైఖరితో రష్యా అధ్యక్ష స్థానంలో సెటిల్ అయిన ఆయన.. ఎంత శక్తివంతమైన నేతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పవర్ ఫుల్ లీడర్ తో వియ్యం అందుకోవటానికి ఒక నియంత తీవ్రంగా ట్రై చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రష్యాతో అంతగా సంబంధాలులేని లిబియా మాజీ నియంత గడాఫీ తీవ్రంగా ప్రయత్నించాడట.
తనకు తిరుగులేని విధంగా సాగుతున్న నియంత గడాఫీ తీరుపై లిబియా ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావటం.. ఆ దేశంలో చోటు చేసుకున్న తిరుగుబాటుతో 2011లో ఆయన హతమయ్యారు. అనంతరం ఆయన కొడుకు సయిఫ్ అల్ ఇస్లామ్ కు జులైలో మరణ దండనను విధించారు.
అప్పట్లో గడాఫీకి మాజీ సలహాదారుగా వ్యవహరించిన మహ్మద్ అబ్దుల్ ఈల్ మొతలెబ్ తాజాగా గడాఫీ.. పుతిన్ కు సంబంధించిన ఒక ఆసక్తికర కోణాన్ని ఆవిష్కరించారు. రష్యా.. లిబియా మధ్యన సంబంధాలు లేనప్పటికీ.. పుతిన్ కుమార్తెను తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసిన పక్షంలో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయన్న ఆకాంక్షను గడాఫీ వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించి పుతిన్ తో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే.. గడాఫీతో వియ్యం అందుకోవటానికి పుతిన్ ఆసక్తి ప్రదర్శించలేదు. గడాఫీ కొడుకుల గురించి తన కుమార్తెలకు ఏమీ తెలీదని చెప్పటం ద్వారా పుతిన్ తప్పించుకున్నట్లుగా మహ్మద్ అబ్దుల్ ఈల్ చెప్పుకొచ్చారు. ఒకవేళ.. పుతిన్ ను కానీ గడాఫీ ఒప్పించి ఉంటే.. పరిస్థితులు మరోలా ఉండేవేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.