Begin typing your search above and press return to search.
రూ.1000 ఫైన్...బయోడైవర్సిటీ కారు ప్రమాదంలో ట్విస్ట్
By: Tupaki Desk | 24 Nov 2019 4:13 PM ISTహైదరాబాద్ గచ్చిబౌలి లోని బయో డైవర్సిటీ వద్ద జరిగిన ఘోర ప్రమాదం..దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫ్లై ఓవర్ పై వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోవడంతో... ఫ్లై ఓవర్ కింద ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఫ్లై ఓవర్ మీదినుంచి వెళ్తున్న కారు అదుపు తప్పి అచ్చం సినిమా సన్నివేశాల్ని తలపిస్తూ గాల్లో పల్టీలు కొడుతూ కిందపడిపోయి బీభత్సాన్ని సృష్టించిన ఈ ఉదంతంలో..ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనకు కారకుడైన కారు నడుపుతున్న వ్యక్తికి పోలీసులు ఎంత ఫైన్ వేశారో తెలుసా? వెయ్యి రూపాయలు. ఔనండి. కేవలం వెయ్యి. అది కూడా ఎందుకో తెలుసా? అధిక వేగంతో వాహనం నడుపుతున్నాడని!
నగరవాసులను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసిన ఈ ప్రమాదంలోని కారు యజమాని పేరు కృష్ణమిలన్ రావు. ప్రమాదానికి గురయ్యే సమయంలో కృష్ణమిలన్ కారును అతివేగంతో నడుపుతున్నట్టు స్పీడ్ గన్ ద్వారా గుర్తించిన పోలీసులు ఈ వెయ్యి రూపాయల ఫైన్ వేశారు! కారు నెంబర్ ఆధారంగా పోలీసులు ఆయన వివరాలు సేకరించి ఈ మేరకు జరిమానా విధించారు. ఆయన చేసిన ప్రమాదంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా...ఎయిర్ బెలూన్స్ బాక్స్ ఓపెన్ కావడంతో కృష్ణమిలన్ చిన్న గాయాలతో బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే ఆయనకు ఎంగేజ్ మెంట్ అయింది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కృష్ణమిలన్ ప్రమాదం చేసి, ఒకరి మృతికి కారణమయ్యారు. దీనికి గాను..పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.
ఇదిలాఉండగా, ఫ్లై ఓవర్ ప్రారంభించిన నెలరోజుల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. గతంలో సెల్ఫీ తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. తాజా ప్రమాదానికి అతివేగమే కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మలుపు వద్ద 40 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే పాటించాల్సి ఉన్నప్పటికీ, సదరు కారు డ్రైవర్ 104 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణిస్తున్నట్లు రికార్డయిందని అధికారులు చెప్తున్నారు. వేగనియంత్రణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం మూడురోజులపాటు ఫ్లై ఓవర్‌పై రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.