Begin typing your search above and press return to search.

గబ్బా టెస్ట్ : ధోనీ రికార్డును బద్దలు కొట్టిన పంత్​..!

By:  Tupaki Desk   |   19 Jan 2021 3:52 PM GMT
గబ్బా టెస్ట్ : ధోనీ రికార్డును బద్దలు కొట్టిన పంత్​..!
X
గబ్బా టెస్ట్ మ్యాచ్​లో గెలుపొంది టీం ఇండియా టెస్ట్​ సిరీస్​ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ప్రదర్శన పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఈ మ్యాచ్​లో భారతజట్టు వికెట్​ కీపర్​ రిషబ్ పంత్​ అత్యున్నత ప్రదర్శన చేసి హీరోగా నిలిచాడు.తన అద్వితీయమైన ఆటతీరుతో ఆఖరిమ్యాచ్​లో అదరగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అసలు వరుసగా వికెట్లు పడుతుండటంతో కనీసం మ్యాచ్ డ్రా అయితే చాలని అంతా భావిస్తుంటే పంత్ ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. టెయిలెండర్ల సాయంతో జట్టును గెలిపించి సీరిస్ సొంతం చేశాడు.

అంతేకాక మరో అరుదైన రికార్డును కూడా పంత్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన క్రికెటర్​గా రికార్డుల్లోకి ఎక్కాడు.
గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్​ ధోనీ పేరిట ఉండేది. మహీ 1000 పరుగులు సాధించడానికి 32 ఇన్నింగ్స్ ఆడాడు.అయితే కేవలం పంత్ 27 మ్యాచ్​ఇన్నింగ్స్ లోనే 1000 పరుగులు సాధించి మహేంద్రసింగ్​ ధోనీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో పంత్ అద్భుతంగా ఆడాడు.
గబ్బాలో ఇప్పటివరకు ఓటమి ఎరగని ఆసీస్​కు భారత్​ చుక్కలు చూపించింది.ఈ మ్యాచ్​లో రిషబ్​ పంత్​ మయాంక్ అగర్వాల్ కంటే ముందుగా ఐదో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చాడు. అయితే పంత్​ రికార్డుల కంటే విజయంపైనే దృష్టిసారించాడు. 89 పరుగులు సాధించి జట్టు విజయానికి తోడ్పడ్డాడు. కీలక దశలో పంత్​ జట్టు గెలుపులో పాలు పంచుకున్నాడు.