Begin typing your search above and press return to search.

మంచం విరగొట్టిన కూతుర్ని పరిహారం ఇవ్వాలన్న తల్లి

By:  Tupaki Desk   |   26 Oct 2019 10:06 AM GMT
మంచం విరగొట్టిన కూతుర్ని పరిహారం ఇవ్వాలన్న తల్లి
X
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజంగానే జరిగిన ఘటన. తాను పడుకునే మంచాన్ని తన కుమార్తె వాడి.. దాన్ని విరగొట్టిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లి.. అందుకు తగినయపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్న ఉదంతంగా దీనని చెప్పాలి. అయితే.. ఈ సందర్భంగా జరిగిన చర్చ ఆసక్తికరంగానే కాదు.. కోర్టును సైతం నవ్వుల్లో ముంచెత్తేలా చేయటం గమనార్హం.

ఈ కేసు విషయంలో తీర్పు చెప్పే స్థానంలో కూర్చున్న జడ్జి సైతం నవ్వుల్లో మునిగిపోయి మరీ తీర్పు ఇచ్చారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆ దేశంలో పాపులర్ అయిన టీవీ షోలో ఒకటైన ట్రైల్ బై కైల్ అనే కోర్టు షో నడుస్తుంది. ఈ షోలో భాగంగా వివిధ సమస్యల మీదా.. వ్యక్తిగత అంశాల మీద తమకు న్యాయం జరగాలంటూ వస్తుంటారు. అలా వచ్చిందే విరగొట్టిన మంచం కోసం పరిహారం కేసు. ఈ షోలో తన కుమార్తె మీద ఒక తల్లి చేసిన ఫిర్యాదు విచిత్రంగా మారింది.

నికోలే అనే మహిళ తన కుమార్తె రిహాను ఇంట్లో వదిలి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాలీడేస్ కు వెళ్లింది. అయితే.. ఇంటికి తిరిగి వచ్చిన నికోలే తన బెడ్రూంలోకి వెళ్లి చూస్తే.. తన మంచం విరిగిపోయి ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె కుమార్తె పైన కోర్టుకెక్కింది. తాను ఇంట్లో లేనప్పుడు తన కుమార్తె ఎవరితోనో ఏకాంతంగా గడిపిందని.. అందులో భాగంగా మంచం విరిగినట్లుగా పేర్కొంది.

దీనికి స్పందించినకోర్టు.. మంచం విరిగేంత పని నువ్వు ఏం చేశావ్? అంటూ ప్రశ్నించింది. దీనికి ఆమె బదులిస్తూ.. తాను ఆ మంచాన్ని విరగొట్టలేదని.. తన తల్లి ఆ మంచాన్ని ఎక్కువగా వాడటంతో విరిగిపోయేంత బలహీనంగా తయారైందని పేర్కొంంది. ఆ కారణంతోనే విరిగింది తప్పించి తనదేం తప్పు లేదని వాదించింది. అయితే.. చివరకు తాను తన తల్లి లేనప్పుడు ఆ మంచాన్ని తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వాడానన్న విషయాన్ని ఒప్పుకుంది.

ఇదిలా ఉంటే.. నికోలే వాదనలో మరో యాంగిల్ కూడా ఉంది. తన కుమార్తె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తన బెడ్ విరగొట్టారని.. తానిప్పుడు ఎక్కడ పడుకోవాలన్న ప్రశ్నతో పాటు.. తన కుమార్తెకు తాను కింగ్ సైజ్ బెడ్ ఇచ్చానని.. తన బెడ్ వాడకుండా తన బెడ్ ఎందుకు వాడినట్లు అని ప్రశ్నించింది. ఆమె వాదనలో నిజం ఉందని.. బెడ్ మీద ఏం జరిగిందన్నది కుమార్తె వ్యక్తిగతమైన విషయమే అయినప్పటికీ..దాన్ని డ్యామేజ్ చేయటంలో మాత్రం కుమార్తె తప్పు ఉన్నట్లు కోర్టు తేల్చింది. దీనికికాను.. మన రూపాయిల్లో రూ.1,48,568 మొత్తాన్ని పరిహారాన్ని చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వాదనల సందర్భంగా ఈ షోను పిల్లలు చూడలేని రీతిలో ఇందులోని కంటెంట్ ఉందన్న వాదన వినిపించింది.