Begin typing your search above and press return to search.

బైక్ కి అంతిమ యాత్ర .. వైరల్ ఫోటో !

By:  Tupaki Desk   |   29 Aug 2021 7:00 AM IST
బైక్ కి అంతిమ యాత్ర .. వైరల్ ఫోటో !
X
గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడి జీవితాన్ని అంతకంతకు భారంగా మారుతుంది. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ తో కుటుంబం గడవడమే చాలా కష్టమయిపోతోంది. కరోనా మహమ్మారి సమయంలో అందరికి ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే అటు నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా గత కొంత కాలం నుంచి అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇక ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు ఏకంగా సెంచరీ దాటి పోవడం గమనార్హం.

దీనితో ఇంట్లో నుండి వాహనం బయటకు తీయాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగి పోవడం మాత్రం కొంతమంది జీవితాన్ని మరింత భారంగా మార్చింది. ముఖ్యంగా బైక్ ఉండే వారికి కష్టంగా మారుతుంది. సరైన సమయానికి ఆఫీసుకి , అలాగే ఎక్కడైనా పనికి వెళ్ళవచ్చు అని బైక్ తీసుకుంటే , పెట్రోల్ రేట్లు ఈ విధంగా పెరుగుతుంటే ఆ బైక్స్ ను ఇంట్లోనే పెట్టి మళ్లీ బస్సులోనే ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి ఏకంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ తన బైక్ చనిపోయింది అంటూ బైక్ కి పాడే కట్టి శ్మశానికి మోసుకుపోయాడు. బైక్ కి మాల వేసి , పాడే పై ఎక్కించి మోసుకుపోతున్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

పెట్రోల్, డీజిల్ మరియు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు కానీ ఒంగోలులో దామచర్ల జనార్దన్ చేసిన విచిత్ర నిరసన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెట్రోల్ ధరలను భరించలేక బైక్ చనిపోయింది అంటూ , వారు బైక్ కు అంతిమ యాత్రను ఏర్పాటు చేశారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ధరలు తగ్గిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలు పెంచుతూ ప్రజలను దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో ఇంధన ధరలు తగ్గించి ఈ భారం నుండి సామాన్యుడిని కాపాడాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.