Begin typing your search above and press return to search.

ఆత్మహత్య చేసుకున్న రాజు అంత్యక్రియలు అలా ముగిసాయి

By:  Tupaki Desk   |   17 Sept 2021 10:00 AM IST
ఆత్మహత్య చేసుకున్న రాజు అంత్యక్రియలు అలా ముగిసాయి
X
తీవ్ర సంచలనంగా మారిన ఆరేళ్ల చిన్నారి హత్యాచార నిందితుడు.. కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకోవటంతో అతని చాప్టర్ ముగిసింది. ప్రత్యక్ష సాక్ష్యలు అతనిది ఆత్మహత్యగా చెబుతుంటే.. కొందరు మేధావులు మాత్రం మరేదో జరిగినట్లుగా.. కొత్త తరహా వాదనను వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పోస్టుమార్టం చేసిన వైద్యులు సైతం అతనిది ఆత్మహత్యే అనన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

స్టేషన్ ఘన్ పూర్ సమీపంలోని రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న డెడ్ బాడీపై గ్రీజు మరకలు చూస్తే.. అతను రైలు కింద పడి మరణించినట్లుగా స్పష్టం చేస్తున్నారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నిందితుడి చేతి మీద ఉన్న ‘మౌనిక’ పుట్టుమచ్చ ఆధారంగా అతన్ని గుర్తించినప్పటికీ.. పోస్టుమార్టం చేయటానికి ముందు అతడి కుటుంబ సభ్యులకు చూపించారు. వారు సైతం మరణించింది నిందితుడు రాజుగా ధ్రువీకరించారు.

దీంతో అతని డెడ్ బాడీని వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టు మార్టంను పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే.. అతడి డెడ్ బాడీని సొంతూరుకు కాకుండా వరంగల్ లోని పోతన కాలనీ శ్మశాన వాటికలో బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు. రాత్రి వేళ.. ఏర్పాటు చేసిన ఈ అంత్యక్రియలకు అతని తల్లి.. భార్య హాజరయ్యారు. కుమారుడు చితికి తల్లి నిప్పు అంటించారు. పోస్టుమార్టం.. ఫోరెన్సిక్ రిపోర్టు కీలకం కానుంది. దాదాపు గంట పాటు రాము మృతదేహానికి ఫోరెన్సిక్ వైద్యులు రజా మాలిక్.. ఫోరెన్సిక్ వైద్యుడు ఏజీఎంలో పోస్టుమార్టం పూర్తి చేశారు.