Begin typing your search above and press return to search.

ఇవి తింటే.. కరోనాను ఖతం చేయొచ్చు..

By:  Tupaki Desk   |   10 Jun 2020 3:00 PM GMT
ఇవి తింటే.. కరోనాను ఖతం చేయొచ్చు..
X
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామూహిక వ్యాప్తి దశలోకి వైరస్ వచ్చింది. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులతో జనాలంతా రోడ్లమీదకు వచ్చేసరికి వైరస్ వ్యాప్తి మరింత అధికమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి స్వీయ జాగ్రత్తలతోపాటు, రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోవడమే ఇప్పుడు మన ముందున్న ప్రథమ కర్తవ్యం.

తాజాగా భారత ఆహార పరిరక్షణ నాణ్యత ప్రమాణాల పరిరక్షణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ ఆహారం తినండి.. కరోనా మహమ్మారిని ఎదుర్కోండి అని పిలుపునిస్తూ ఈ వైరస్ ను ఎదుర్కొనే ఆహారంపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏం తింటే మనం కరోనాను ఎదుర్కోవచ్చో తెలిపింది.

ముఖ్యంగా ఖనిజ లవణాలు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ తదితరాలను నిత్యం తీసుకుంటే మహమ్మారిని సమర్థంగా తీసుకునే రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుందని భారత ఆహార సంస్థ తెలిపింది.

*కరోనాను అరికట్టడానికి తీసుకునే ఆహార పదార్థాలివీ..
+ద్రవపదార్థాలివీ: తాగునీరు, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్రీన్ టీ, హెర్బల్ టీ, సూప్ లు, పాలు, మజ్జిగ, తీపి, ఉప్పులేని ద్రావణాలు, పండ్లు, కూరగాయలు

+ ఘన పదార్థాలు: సోయా ఉత్పత్తులు, ఉప్పు కలపని గింజలు, విత్తనాలు, బీన్స్, పప్పు దినుసులు , గుడ్లు, చికెన్, మటన్, చేప, పాలు, పాల ఉత్పత్తులు

*రోగ నిరోధక శక్తి పెంచేవి : వాల్ నట్స్, గుమ్మడి, పుచ్చ, పొద్దు తిరుగుడు విత్తనాలు, చేపలు

+ చిలగడ దుంప, క్యారట్, బొప్పాయి, మామిడి, గుడ్లు, పాలకూర, బచ్చలికూర, ఆకుకూరలు

+సూర్యరశ్మి ఉదయం పూట శరీరానికి తాకేలా చూడాలి. కొవ్వున్న చేపలు, మాంసంలో కాలేయం తినాలి.

*యాంటీబాడీస్ పెంచేవి: ఆకుపచ్చని కూరగాయలు, జామ, దానిమ్మ, ఊసిరి, ద్రాక్ష తదితర పుల్లని పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, నిమ్మ
Tags: