Begin typing your search above and press return to search.

రేపట్నుంచి ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ , FB బ్లాక్ ... అతిక్రమిస్తే ఖేల్ ఖతం

By:  Tupaki Desk   |   25 May 2021 4:33 AM GMT
రేపట్నుంచి ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ , FB బ్లాక్ ...  అతిక్రమిస్తే ఖేల్ ఖతం
X
ట్విటర్, ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లతో సహా సోషల్ మీడియా దిగ్గజ సంస్థలకి కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. కేంద్రం జారీ చేసిన గైడ్ లైన్స్ కి అనుగుణంగా ఇవి నడచుకోవడం లేదని, ఈ విషయంలో విఫలమయ్యాయని వీటికి పంపిన నోటీసులో పొందుపరిచింది. మరో రోజులో వీటిపై కఠిన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. నూతన నిబంధనల ప్రకారం నడుచుకోవాలని గత ఫిబ్రవరి 25 న ఎలెక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వీటికి 3 నెలల గడువునిచ్చింది. దీనికి సంబంధించి ఈ మార్గదర్శకాలను పాటించేలా చూసే అధికారుల నియామకం, ఇండియాలో వారిని కాంటాక్ట్ చేయడానికి గాను వారి అడ్రస్, ఫిర్యాదుల వివరాలు, అభ్యంతర కంటెంట్ మానిటరింగ్, ఆ విధమైన కంటెంట్ తొలగింపు వంటివి ఈ రూల్స్ లో ఉన్నాయి. కాగా వీటిలో ఒక్క కంపెనీ తప్ప మిగతావేవీ అధికారులను నియమించలేదు. కాగా ట్విటర్, ఫేస్ బుక్ ఈ నోటీసుపై ఇంకా స్పందించాల్సి ఉంది. ఏదేమైనా కేంద్రం ఇచ్చిన కొత్త నిబంధనలు రేపటి నుండి అమల్లోకి రానున్నాయి. ఫిబ్రవరి లోనే వీటితో పాటుగా న్యూస్ సైట్స్ , ఓటిటిలకి రూల్స్ విడుదల చేసినా కూడా ఇప్పటి వరకు 'కూ' సైట్ మాత్రమే వీటిని పాటించింది.

కేంద్రం వెలువరించిన మార్గదర్శకాలు ఓ విధంగా భారీ షాక్‌గానే పరిగణించాలి. తాజాగా నిబంధనలతో ఓటీటీ, సోషల్ మీడియాకు దాదాపు కళ్లెం పడినట్టే. ఈ మార్గదర్శకాలను పక్కాగా అమలకు మూడు అంచెల నియంత్రణ విధానాన్ని అనుసరించనునున్నట్టు స్పష్టం చేసింది. తాజా, నిబంధనల ప్రకారం.. ఏదైనా పోస్టును తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే వాటిని పాటించాలి. లేదంటే.. సదరు సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేస్తారు.నోటీసులు జారీచేసిన దాదాపు 36 గంటల్లోపే ఆ కంటెంట్‌ ను తొలగించాలి. ఇక అధికారులు ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంటల్లోగా పూర్తి సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ ఫాంలపైనా కీలక షరతులు విధించారు.

ఓటీటీ నిబంధనలు

1. ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఇష్టానుసార వీడియోలు పోస్ట్‌ చేయడం, అసభ్య, అశ్లీల, హింసాత్మక కంటెంట్‌పై నిషేధించింది.

2. వయస్సు ఆధారంగా ఐదు విభాగాలుగా ఓటీటీ విభజించి, సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్‌పై నిషేధం విధించారు.

3. మహిళలు, చిన్నారులు, దళితులను అవమానించేలా, జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా ఉన్న అంశాలపై నిషేధం.

4. అసత్య ప్రచారం ప్రారంభించే తొలి వ్యక్తి వివరాలు కచ్చితంగా వెల్లడించాలి.

5. ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం సంస్థలు దేశంలోనే కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.


సోషల్ మీడియా నిబంధనలు..

1. సోషల్ మీడియా వేదికల్లో సమాచారం, కంటెంట్‌పై వినియోగదారుల ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలి.

2. అభ్యంతరకరమైన అంశాలను గుర్తించిన తరువాత వాటిని 24 గంటల్లో తొలగించాలి. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.

3. నోడల్ ఏజెన్సీ 24 గంటలు పనిచేస్తూ పర్యవేక్షిస్తుంది.. ఫిర్యాదులను అమలు చేయడానికి ఈ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది.

4. ఈ నిబంధనలను ప్రచురించిన తేదీ నుంచి 3 నెలల్లోపు చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ (సీసీఓ)ను నియమించాలి. చట్టానికి, నిబంధనలకు సీసీఓ బాధ్యత వహించాలి.