Begin typing your search above and press return to search.
లేటు వయస్సు లో లేత ప్రేమ ...యూకే లో ఓ ప్రబుద్దిడి నిర్వహం
By: Tupaki Desk | 27 Jan 2020 11:46 AM ISTలైంగిక వేధింపులు ..ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అమ్మయిలా జీవితాలలో కొందరు కామాంధులు ఆడుకుంటున్నారు. మొదట్లో మాయ మాటలు చెప్పి వారిని నమ్మించి , తమ ట్రాప్ లో పడ్డ తరువాత వారికీ చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా బయట పడుతున్నాయి. అయినప్పటికీ కూడా అమ్మాయిలు ఇంకా ఇలాంటి ట్రాప్స్ లో పడి లైంగికంగా అనేక ఇబ్బందులని ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలే లక్ష్యంగా కొందరు తమ ప్లాన్ అమలు చేస్తూ , వారిని లైంగికంగా వేధిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా ఒకటి యూకే లో బయటపడింది. భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి 21 మంది మైనర్లను ఆన్ లైన్ లో లైంగికంగా వేధించాడు. వారిలో ముగ్గురు అమ్మాయిలు వాడి వేధింపులని తట్టుకో లేక పోలీసులకి ఫిర్యాదు చేయడం తో ఈ వ్యవహారం మొత్తం బయట పడింది.
పూర్తి వివరాలు చూస్తే ... భారత సంతతికి చెందిన వాల్మీకి రాంప్రసాద్ కి లండన్ కోర్టు గురువారం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. బాలికలను ఆన్ లైన్ లో లైంగికంగా ప్రేరేపించడం, అసభ్య చిత్రాలను తయారు చేయడం వంటి 26 నేరాలు రుజువవడంతో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. న్యాయస్థానం లో తెలిపిన వివరాల ప్రకారం... 2017, అక్టోబర్ నుంచి 2018, సెప్టెంబర్ వరకు రాంప్రసాద్ సుమారు 21 మంది మైనర్లను ఇలా ఆన్ లైన్ వేదిక గా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తుంది. బాధిత బాలికలందరీ వయసు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిసింది. 47 ఏళ్ల వయస్సు ఉన్న వాల్మీకి రాంప్రసాద్ , ఒక టీనేజ్ బాయ్ గా పరిచయం చేసుకొని మైనర్ల తో స్నేహం చేసేవాడు. దీనికోసం రాం ప్రసాద్ ఏకంగా 78 బోగస్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకున్నాడు.
అనంతరం టీన్ డేటింగ్ కోసం డిజైన్ చేసిన ప్రముఖ ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ Mylol.co ద్వారా టీనేజ్ బాలికలతో పరిచయం పెంచుకునేవాడు. ఆ తరువాత వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. బాలికలను ఆన్‌లైన్లో లైంగికంగా ప్రేరేపించడంతో పాటు వారి నుంచి పర్సనల్ ఫొటోలు తీసుకుని, అసభ్యకర చిత్రాలను తయారు చేయడం చేసేవాడు. అయితే, అతని వేధింపులు ఎక్కువ కావడం తో భరించలేక ముగ్గురు బాధిత బాలికలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రాంప్రసాద్ బండారం బయట పడింది. భాదిత అమ్మాయిల ఫిర్యాదు మేరకు రంగం లోకి దిగిన పోలీసులు ..అతన్ని పట్టుకొని , కోర్ట్ లో హాజరు చేయగా.. కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన రాం ప్రసాద్ కు న్యాయస్థానం గురువారం శిక్షను ఖరారు చేసింది. అతనికి ఆరేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.