Begin typing your search above and press return to search.

‘251’’ ఫోన్ వెబ్ సైట్ ఓపెన్ అవట్లేదు బాస్

By:  Tupaki Desk   |   18 Feb 2016 12:31 PM IST
‘251’’ ఫోన్ వెబ్ సైట్ ఓపెన్ అవట్లేదు బాస్
X
గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారటమే కాదు.. గురువారం ఉదయం 6 గంటలు ఎప్పుడు అవుతుందా? అని ఎదురుచూసినోళ్లు కోట్లల్లో ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు కానీ దుప్పట్లో నుంచి బయటకు రానోళ్లు సైతం ఉదయం ఐదున్నర గంటలకే లేచి కూర్చొని ఉదయం ఆరు ఎప్పుడు అవుతుందా? అని ఎదురుచూశారు. ఇదంతా రూ.251కి రింగింగ్ బెల్స్ కంపెనీకి చెందిన ఫ్రీడం 251 ఫోన్ కోసమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగానే కాదు.. సెల్ ఫోన్ కంపెనీల్లోనే పెద్ద చర్చనే రేపిన ఫ్రీడం 251 ఫోన్ ను చేజిక్కించుకోవటానికి ఎంతోమంది ఆశగా ఎదురుచూశారు.

కంపెనీ పేర్కొన్నట్లుగా గురువారం ఉదయం 6 గంటల నుంచి బుకింగ్స్ కోసం వెబ్ సైట్ కొందరికి ఓపెన్ కాకుంటే.. మరికొందరికి సైటు ఓపెన్ అయినా.. బుకింగ్ పేజీని క్లిక్ చేస్తే.. ‘తెల్ల కాగితం’ మాదిరి స్ర్కీన్ ఉండిపోతుంది తప్పించి.. మరెలాంటి రిజల్ట్ రావట్లేదు. దీంతో.. పొద్దుపొద్దున్నే ఫోన్ ను బుక్ చేద్దామని ఆశపడ్డ వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాదు.. తమ ఆవేదనను.. ఆవేశాన్ని ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలోనూ వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మొత్తానికి ఊరించి.. ఊరించిన ఫ్రీడం 251 ఫోన్ ను బుక్ చేసుకోవటం అంత ఈజీ కాదన్న విషయం తాజాగా తేలిపోయింది.