Begin typing your search above and press return to search.
గ్రేటర్ ఎన్నికల్లో ఫ్రీ హామీలు.. జీహెచ్ ఎంసీకి అంత సీన్ ఉందా?
By: Tupaki Desk | 27 Nov 2020 10:30 AM ISTఎన్నికలు వస్తే చాలు.. పార్టీలు ఇచ్చే హామీలకు అంతే లేదు. గతంలోనూ హామీలు ఇచ్చినా.. అంతో ఇంతో ఆచరణకు దగ్గరగా ఉండేట్లు వరాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. నోటికి వచ్చినవన్నీ ఉచితంగా ఇచ్చేస్తామన్నట్లుగా వారి మాటలు ఉండటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలంటే దాదాపు రూ70వేల కోట్లు కావాల్సి ఉంటుంది. అంటే.. ఈ హామీల్ని ఐదేళ్ల వ్యవధిలో తీరుస్తారని చెబితే.. ఇందుకోసమే ప్రతి ఏడాది రూ.14వేల కోట్లను అదనంగా జీహెచ్ఎంసీకి కేటాయించాల్సి ఉంటుందన్నది మర్చిపోకూడదు.
డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తాం.. విద్యుత్.. నల్లా నీళ్లు.. ఇంటర్నెట్.. మెట్రో.. సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఉచితాల చిట్టా ఈసారి ఎక్కువగానే ఉందని చెప్పాలి. వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో వివిధ పార్టీలు ఇస్తున్న హామీలు అమలు అంత తేలికైన విషయం కాదని చెప్పాలి. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తప్పించి.. ఏ పని చేయలేని పరిస్థితి.
నల్లా విషయానికే వస్తే.. ఒక పార్టీ 20వేల లీటర్లు ఉచితంగా ఇస్తానని చెబితే.. మరోపార్టీ 30వేల లీటర్లు ఉచితమని చెబుతోంది. ఇలా ఒకరికి మించి మరొకరు ఉచితాల మీద ఉచితాలు చెప్పేయటం చూస్తే.. ఓట్లే లక్ష్యంగా ఎన్నికల హామీలు ఉన్నాయని చెప్పాలి. వరద బాధితులకు ఒక పార్టీ రూ.50వేలు ఇస్తామంటే.. మరోపార్టీ రూ.25వేలు.. ఇంకో పార్టీ రూ.10వేలు ఇస్తామని చెప్పటం చూస్తే.. ఇంత భారీ మొత్తాలు పరిహారం కింద ఇవ్వాలంటే ఎన్ని వందల కోట్లు అవసరమవుతాయన్నది ప్రశ్న. నిజానికి ఇన్ని ఉచితాల్ని అమలు చేసే సీన్ జీహెచ్ఎంసీకి ఉందా? అన్నది ప్రశ్న.
ఎందుకంటే.. జీహెచ్ఎంసీకి ఆస్తిపన్నుతో పాటు.. వాణిజ్య సంస్థలు చెల్లించే పన్నులు తప్పించి.. మరే రూపంలోనూ ఆదాయం ఉండదు. ఒకవేళ వస్తేగిస్తే.. అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుంది. వేలాది కోట్ల ఖర్చుకు సంబంధించిన వరాల్ని ఇట్టే ఇచ్చేస్తున్న పార్టీలు.. వాటి అమలు విషయంలోనూ ఇంతే సీరియస్ గా ఉంటారా? అన్నది అసలు ప్రశ్న. ఏమైనా.. ఉచితాల పేరుతో ఓట్లను కొల్లగొట్టాలనే ప్లాన్ ను పార్టీలు చేపట్టాయని చెప్పక తప్పదు.