Begin typing your search above and press return to search.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..?

By:  Tupaki Desk   |   11 March 2021 10:15 AM GMT
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..?
X
ఆర్టీసీ బస్సు అంటే భద్రత. ఎంతదూరం అయినా కూడా ఆర్టీసీ బస్సు లో పొతే ఎంటువంటి ఇబ్బంది ఉండదు అని చాలామంది అభిప్రాయం. నిర్ణిత స్పీడ్ లో మాత్రమే బస్సుని నడుపుతారని అందరి నమ్మకం. అందుకే ఎక్కువమంది ఆర్టీసీనే ప్రిఫర్ చేస్తారు. ఏ క్షణంలో అయినా , ఎక్కడి నుండైనా పల్లె నుండి పట్నం వరకు ఆర్టీసీ బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ యాజమాన్యం ఎక్కువగా మహిళల రక్షణకోసం కొత్త కొత్త ఆదేశాలను జారీ చేస్తూ ఉంటుంది. మహిళలకు రక్షణగా వారికీ ప్రత్యేకించి మహిళలకోసమే సీట్లను కూడా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఎంత దూరమైనా రాత్రుళ్ళు సమయాల్లో కూడా మహిళలు ధైర్యంగా బస్సులో ప్రయాణం చేసే సౌఖర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.

ఇదిలా ఉంటే పంజాబ్ ప్రభుత్వం మహిళలకి గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రమంతా మహిళలకి ఉచిత ప్రయాణాలకు అనుమతించింది. రాష్ట్రంలో ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా మహిళలు బస్సుల్లో ఉచితంగా వెళ్లవచ్చని ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ బడ్జెట్ సందర్భంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు.అంతేకాకుండా పంజాబ్ లో ఉన్న వేలాది మంది మహిళలకు అన్ని ఆర్టీసీ బస్సులలో ఏ సమయంలో అయినా బస్సులలో ప్రయాణం చేస్తే వారికి ఎటువంటి చార్జీలు ఉండవని ఉచితంగా వారు ప్రయాణం చేయవచ్చు అని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ నిర్ణయం పంజాబ్ లోని వేలాది మంది మహిళల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుందని ఆయన అన్నారు. అన్ని ప్రభుత్వ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం మా ప్రభుత్వం తీసుకొన్నందుకు నేను సంతోషంగా ఉంది. ఆడవారిని శక్తిమంతం చేసే ప్రయత్నాల్లో మేము పట్టుదలతో ఉన్నాం. మహిళల సాధికారితే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇకపైనా ఇలాంటి విధానాలే కొనసాగిస్తాం అని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌలభ్యమే కాకుండా మహిళల సాధికారిత సాధించేందుకు పంజాబ్ ప్రభుత్వం 8 కొత్త పథకాలను ప్రవేశపెట్టనుంది.పాటియాలా, జలంధర్, లుథియానా, మొహలీ, బటిండా, మాన్సా లాంటి పట్టణాల్లో పనిచేసే మహిళలకు ఏడు ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయనుంది. ఎవరైనా పంజాబ్ ను సందర్శించాలని ప్లాన్ చేసుకుంటే వారి పర్యటన కోసం ఇక్కడ వర్చువల్ టూర్ ఆప్షన్ ఉంది.