Begin typing your search above and press return to search.

హెచ్ఐవీ నుంచి ఇక విముక్తి..! పరిశోధనలు సక్సెస్..

By:  Tupaki Desk   |   16 Jun 2022 7:30 AM GMT
హెచ్ఐవీ నుంచి ఇక విముక్తి..! పరిశోధనలు సక్సెస్..
X
ఆ వ్యాధి సోకిన వ్యక్తిని దగ్గరికి రానిచ్చేవారు కాదు.. ఊరు చివరనా ఉంచి ఆహారం అందించేవారు.. ఆ తరువాత మరణిస్తే కూడా దగ్గరికి వెళ్లేవారు కాదు.. కొందరు కావాలని అంటించుకున్నా.. మరికొందరికి అనుకోకుండా వచ్చినా.. ఎయిడ్స్ సోకితే మాత్రం ఒకప్పుడు మరణానికి దారి పడ్డట్లే.. కానీ వైద్యశాస్త్రంలో ఎన్నో పరిశోధనల ఫలిలంగా ఈ వ్యాధిని ఎదుర్కొనే శక్తిని పరిశోధకులు కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ ఐవీ వైరస్ ను అంతమొందించే ఓ సరికొత్త మందును ఇజ్రాయెల్ కు చెందిన వైద్యులు కనుగొన్నారు. దీనిని ఇంజెక్షన్ రూపంలో ఇస్తే హెచ్ ఐవీని పూర్తిగా నిర్మూలించవచ్చని టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

మానవాళిని గడగడలాడించింది ఎయిడ్స్. అయితే ఎయిడ్స్ కు కారణమయ్యే హెచ్ ఐనీని ఇంజక్షన్ ద్వారా ఎలా అంతమొందించచ్చో వైద్యులు వివరించారు. ఎముకల్లో బి టైప్ గా పిలిచే తెల్ల రక్తకణాలు తయారవుతాయి. ఇవి కాస్త అభివృద్ధి చెందిన తరువాత మజ్జ నుంచి రక్తం, గ్రంథుల వ్యవస్థల్లోకి వెళ్తాయి. ఆ తరువాత వివిధ అవయవాలకు చేరుకుంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే వైరస్ ను ఎదుర్కోగలుగుతాయి. కానీ హెచ్ ఐవ వంటి వైరస్ లో వాటిపై ప్రభావం చూపి విచ్చిన్నమయ్యే లా చేస్తాయి. అప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గి మనిషి శరీరంలో మార్పులు వస్తాయి.

అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వైరస్ లోని కొన్ని భాగాలను ఉపయోగించి బి కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. ఇలా మార్పులు చేసిన కణాలు వైరస్ ఎదురుపడినప్పుడు దాని ప్రభావానికి గురి కావు. అంతేకాకుండా వైరస్ ను పసిగట్టి, వాటి ప్రవర్తనను మార్చుకుంటాయి. అలా హెచ్ ఐవీని అడ్డుకునే యాంటిబాడీలా పనిచేస్తుంది. ఫలితంగా వైరస్ నుంచి అంతమొందించేలా పనిచేస్తుంది.

బీ టైప్ తెల్ల కణాల్లో మార్పులు చేసి వైద్యశాలలో మార్పులు చేశామని పరిశోధనలో పాల్గొన్న ఓ వైద్యుడు తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం.. సాంకేతికతను ఉపయోగించి తెల్ల రక్త కణాల జన్యువుల్లో మార్పులు చేశామని, ఆ తరువాత వైరస్ ను అడ్డుకునే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని అన్నారు. దీంతో హెచ్ఐవీని నిరోధించేందుకు ఇది బాగా పనిచేసిందని అంటున్నారు.

అయితే ప్రస్తుత పరిశోధనలు విజయవంతం అయినా దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టొచ్చని పరిశోధకులు అంటున్నారు. ఎయిడ్స్ వైరస్ ను అడ్డుకునేందుకు మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని, ఇక వ్యక్తులపై ప్రయోగాలు చేసిన తరువాత విజయవంతం అయ్యాయే మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అన్నారు.